ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు @9am - main news in andhrapradesh

.

top ten news in andhrapradesh
top ten news in andhrapradesh

By

Published : May 17, 2020, 9:02 AM IST

  • ముందుకెళ్లొద్దని చెప్పండి

సమగ్ర ప్రాజెక్టు నివేదికలను పరిశీలించేంత వరకు కొత్త ప్రాజెక్టు పథకంపై ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లకుండా ప్రాజెక్టు పనులు ఆపేయాలని ఏపీని కోరాలని కృష్ణా బోర్డుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెప్పినట్లు వెల్లడించారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి

  • ఆ అవసరం ఉంది..

విశాఖ గ్యాస్​ లీకేజ్​ ప్రమాదం కారణంగా పర్యావరణానికి జరిగిన నష్టాలను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఎన్జీటీ ఏర్పాటు చేసిన కమిటీ ఛైర్మన్ విశాంత్ర న్యాయమూర్తి జస్టిస్ శేషనయనారెడ్డి అన్నారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి

  • అలుపుండదా..?

ఉన్న ఊరు పనిలేదు పొమ్మంటోంది... సొంతూరు రా రమ్మంటోంది... అందుకే... పదులు, వందలు, వేల కిలోమీటర్లు ఇలా దూరం ఎందాకైనా కాళ్లే చక్రాలుగా మార్చుకుని వలస కూలీలు కదిలి వెళ్తున్నారు. మరి వలస జీవుల్లో ఆ సత్తువ ఎక్కడిది.. అంత దూరం నడిచి వెళ్లాలనే ఆత్రం ఎందుకు? పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..

  • సర్వత్రా ఉత్కంఠ

కరోనా కట్టడికి విధించిన మూడో విడత లాక్​డౌన్ నేటితో పూర్తికానుంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే లాక్​డౌన్​ 4.0లో నిబంధనలు కొత్తగా ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈసారి రూల్స్ ఎలా ఉంటాయి? వేటికి అనుమతి ఉంటుంది? ఏ ఆంక్షలు కొనసాగుతాయే అధికారులు ఇచ్చిన సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • తబ్లిగీల అరెస్ట్

మధ్యప్రదేశ్​ భోపాల్​లో 60 మంది తబ్లిగీ జమాత్​ సంస్థకు చెందిన విదేశీయులను అరెస్ట్​ చేశారు పోలీసులు. పర్యటక వీసాపై వచ్చి.. మతరపమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు గుర్తించామన్నారు. విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు తెలిపారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి

'ఆంఫాన్'​ ఆగయా..

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి వాతావరణ శాఖ 'ఆంఫాన్‌'గా నామకరణం చేసింది. ప్రస్తుతం అంఫాన్‌ తుపాను ఒడిశాలోని పారాదీప్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ గుర్తించింది.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • అమృత భాండాగారం

లాక్‌డౌన్‌ కారణంగా బతుకుతెరువు కరవై.. స్వస్థలాలకు వెళ్లలేక ఆకలితో అలమటిస్తున్నవారి ఆకలి తీరుస్తోంది.. కర్ణాటక ధార్వాడ్‌లోని 'అక్షయ పాత్ర' వంటశాల. ఆసియాలోని అతిపెద్ద వంటశాలల్లో ఈ 'అక్షయపాత్ర' ఒకటి. రోజుకు 2.50 లక్షల భోజనాలు తయారుచేసే సామర్థ్యం దీనికి ఉంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి

  • రియల్​మీ టీవీ..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియల్​మీ స్మార్ట్​వాచ్​, టీవీలను భారత్​ మార్కెట్​ల్లోకి ప్రవేశపెట్టనున్నట్లు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ రియల్​మీ ప్రకటించింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ రిటైర్మెంట్​​పై వస్తోన్న ఊహాగానాలపై స్పందించాడు ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్​. వీడ్కోలు​ విషయమై అతడు త్వరలో ఒక నిర్ణయానికి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • ఆన్​లైన్​లో​ఆట.. లైక్​ల వేట

ఇప్పుడు క్రికెటర్ల ఆటంతా ఆన్‌లైన్‌లోనే! లాక్‌డౌన్‌ కారణంగా లభించిన విరామాన్ని తమ అభిరుచులను నెరవేర్చుకోవడానికి వాళ్లు ఉపయోగిస్తున్నారు. లేదా భిన్నమైన వీడియోలు పెడుతూ అభిమానులను అలరిస్తున్నారు. మరి ఇలా చేస్తున్నవాళ్లలో ముందు వరుసలో ఉన్నదెవరో చూద్దాం.. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details