- 'ఆనందయ్య మందుకు అనుమతి వస్తే.. ఔషధం తయారీకి తితిదే సిద్ధం'
ఆనందయ్య మందుకు అనుమతి వస్తే ఔషధం తయారీకి తితిదే సిద్ధమని పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. వైద్యుల బృందంతో కలిసి ఆయుర్వేద ఔషధం పరిశీలించామన్న చెవిరెడ్డి..మందులో దుష్ప్రభావ పదార్థాలు లేవని వైద్యులు చెప్పారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆనందయ్యది ఆయుర్వేదం కాదు..నాటు మందు'
కృష్ణపట్నం ఆనందయ్య మందును నాటు మందుగా గుర్తించినట్లు రాష్ట్ర ఆయుశ్ శాఖ కమిషనర్ కర్నల్ రాములు స్పష్టం చేశారు. కృష్ణపట్నంలో పర్యటించిన కమిషనర్ నేతృత్వంలోని వైద్య బృందం మందు తయారీ విధానాన్ని పరిశీలించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పరిమితంగానే తుపాను ప్రభావం!
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. నేటి రాత్రివరకు.. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలపై పరిమితంగా తుపాను ప్రభావం ఉంటుందని, ఇవాళ ఇరు రాష్ట్రాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్‌లో 2% కాదు.. 24% మందికి కరోనా!
భారత్‌లో 24.1 శాతం మంది కరోనా బారినపడినట్లు ఐసీఎంఆర్ ఇటీవల నిర్వహించిన సెరోసర్వేలో వెల్లడైంది. ఒక్క కరోనా కేసు గుర్తిస్తే.. 27 మందికి వైరస్ సోకినట్లే అని పేర్కొంది. దేశంలో పదేళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బాధితులే అని సర్వే స్పష్టం చేసింది. అయితే ఈ లెక్కలకు, ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలకు అసలు పొంతనలేకపోవడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డాక్టర్ రెడ్డీస్ నుంచి కరోనాకు కొత్త ఔషధాలు!
కొవిడ్ రోగుల కోసం కొత్త చికిత్సా విధానాలను తాము అభివృద్ధి చేస్తున్నామని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. రానున్న నెలల్లో వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పింది. అదే సమయంలో.. ప్రస్తుతం వినియోగిస్తున్న ఔషధాల ఉత్పత్తిని కూడా కొనసాగిస్తామని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 100 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేసిన స్టార్ సింగర్