- మూడు రాజధానులకు మద్దతుగా.. వైకాపా నాయకుల ప్రత్యేక పూజలు
YSRCP : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు మూడు రాజధానులకు మద్దతుగా పూజలు చేశారు. మూడు రాజధానులకు ప్రజలు మద్దతు తెలపాలని పలువురు నాయకులు ప్రజలను కోరారు.
- తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇకపై భారత్ రాష్ట్ర సమితి
TRS Plenary Session begins: తెరాసను జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన తెరాస సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇకపై తెరాస ‘భారత్ రాష్ట్ర సమితి’ గా మారింది.
- రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు: అమరావతి వాతావరణ కేంద్రం
AP WEATHER UPDATES : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత తగ్గిందని.. వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే కోస్తాంధ్ర మీదుగా పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ పలుచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
- ఉక్రెయిన్‌లోని నా పెంపుడు పులులను రక్షించండి.. ఆంధ్రా వైద్యుడి విన్నపం
Andhra Doctor Request Indian Government: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఉక్రెయిన్ పౌరులపై చాలా ప్రభావాన్ని చూపించింది. పుతిన్ సేన దాడులతో భయానికి గురైన ప్రజలు.. ఇళ్లు వదిలిపెట్టి పోయిన సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్ను వీడిన ఓ ఆంధ్రా డాక్టర్.. తన పెంపుడు పులులను రక్షించాలని భారత్‌తో పాటు వివిధ దేశాలను వేడుకుంటున్నారు.
- అంబానీ కుటుంబానికి మరో బెదిరింపు కాల్.. ఫ్యామిలీ మెంబర్ల పేర్లు చెప్పి మరీ..
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి ఓ ఆగంతుకుడు కాల్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంబానీ కుటుంబానికి చెందిన కొంతమంది సభ్యుల పేర్లతో బెదిరింపులకు పాల్పడ్డాడని ముంబయి పోలీసులు తెలిపారు.
- వాహనం సీక్రెట్ పైపులో 23కేజీల బంగారం స్మగ్లింగ్.. ఒకే నెలలో 121కిలోలు సీజ్
మయన్మార్ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.11.65 కోట్ల విలువైన 23.23 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు ఈశాన్య ప్రాంత సరిహద్దులో స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, పంజాబ్‌లోని అమృత్సర్ సరిహద్దులో నాలుగు హెరాయిన్ ప్యాకెట్లను బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
- ముగ్గురు శాస్త్రవేత్తలను వరించిన రసాయనశాస్త్ర నోబెల్
రసాయనశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు.. ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. 'ఇంజినీరింగ్ టూల్స్ ఫర్ మాలిక్యూల్స్ బిల్డింగ్స్' పరిశోధనలకు ఈ అవార్డు అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో నిలిచే జట్లు ఇవేనా?
ICC t20 World Cup 2022 : 2022 టీ20 ప్రపంచకప్ ఫైనల్ రేసులో ఆ మూడు జట్లు నిలుస్తాయని ఆసీస్ మాజీ ఆటగాడు మైఖేల్ బెవన్ తెలిపాడు. ఆ మూడు జట్లు ఏవంటే?
- చిరంజీవి ఫ్యామిలీతో 'గొడవల'పై అల్లు అరవింద్ క్లారిటీ!
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో వచ్చిన గొడవలపై దర్శకుడు అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. అలీతో సరదాగా షోకు.. ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన పలు విశేషాలను తెలిపారు. ఇంతకీ ఏమన్నారంటే..
- గ్లామర్ డోస్ పెంచిన యాంకర్ శ్రీముఖి.. గ్రీన్ డ్రెస్‌లో స్పెషల్ ఫొటోషూట్!
ఓ వైపు బుల్లితెరపై అలరిస్తూనే.. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపైనా మెరుస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది యాంకర్, నటి శ్రీముఖి. సోషల్‌మీడియాలోనూ చురుగ్గా ఉండే శ్రీముఖి తరచు రకరకాల డిజైనర్‌వేర్‌లను ధరించి ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తోంది. అభిమానులతో పాటు ఫ్యాషన్ ప్రియులనూ ఆకట్టుకుంటోంది.
top news