ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

ఏపీ ప్రధాన వార్తలు

TOP NEWS AP
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Sep 25, 2022, 11:00 AM IST

  • రేణిగుంటలో అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలతో సహా డాక్టర్​ మృతి
    Fire Accident in Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలోని భగత్ సింగ్ కాలనీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కార్తిక చిన్నపిల్లల ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఒక్కసారి మంటలు మొత్తం వ్యాపిండంతో.. ఆస్పత్రిపైనే ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. వైద్యుడు రవిశంకర్‌రెడ్డి మంటల్లోనే సజీవ దహనమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పుట్టిన బిడ్డ నల్లగా ఉందని.. భర్త ఎంత పని చేశాడంటే..!
    Husband Killed Wife: ఒడిశాలో సహజ మరణం అని అందరు అనుకున్న మహిళ మృతి ఘటన.. కొత్త మలుపు తిరిగింది. చిన్నారి వచ్చీ రాని మాటలతో చెప్పిన విషయాలతో చిన్నారి సహజ మరణం అనుకున్న కేసులో.. భర్తే భార్యను గొంతు నులిమి చంపేశాడని తేలింది. అసలేం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భక్తులకు శ్రీవారి దర్శనంలో తితిదే తీరుపై హైకోర్టు ఆక్షేపణ
    High Court on TTD: భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించే విషయంలో తితిదే అనుసరిస్తున్న తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. శ్రీవెంకటేశ్వరస్వామి వారి సేవ కోసం మేల్ చాట్ వస్త్ర సేవ, ఆర్జిత సేవల కోసం 14 ఏళ్ల కిందట భక్తులు బుక్ చేసుకున్న టికెట్లను కొవిడ్ కారణం చెప్పి రద్దు చేయడాన్ని తప్పుపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ‘ఇందూ ప్రాజెక్ట్స్‌’కు బ్యాంకులు భారీ రుణాలు ఇవ్వడంలో తప్పు జరిగింది..!: కె. నరసింహమూర్తి
    K Narasimha Murthy: లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన భూములను తాకట్టు పెట్టుకొని... ఇందూ ప్రాజెక్ట్స్‌కు బ్యాంకులు భారీ రుణం ఇవ్వడంలో తప్పు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని... జాతీయస్థాయిలో అనేక ఆర్థిక సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన నిపుణుడు కె.నరసింహమూర్తి అన్నారు. బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఆస్తులను విభజించి విక్రయిస్తే అప్పుగా ఇచ్చిన సొమ్మంతా రాబట్టుకోవచ్చని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తలాక్ చెప్పిన భర్త.. అతడి మిత్రుడితో మహిళ కొత్త జీవితం.. పేరు 'పుష్ప'గా మార్చుకొని..
    ప్రేమబంధంతో ఒక్కటైనప్పటికీ అనుమానంతో భార్యను ఇంటినుంచి గెంటేశాడు ఓ వ్యక్తి. దీంతో ఆ మహిళ.. భర్త స్నేహితుడిని వివాహం చేసుకుంది. హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకొని 'పుష్ప'గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారతీయులకు గుడ్​న్యూస్.. గ్రీన్​కార్డు దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం!
    అమెరికా గ్రీన్​ కార్డు దరఖాస్తులను వేగవంతం చేయాలని అమెరికా ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ నుంచి వచ్చిన సూచనలను వైట్​హౌస్ పరిశీలిస్తోంది. ఈ మేరకు ​మొత్తం పెండింగు దరఖాస్తులన్నింటినీ 2023 ఏప్రిల్‌లోగా పరిష్కరించాలని ప్రతిపాదనలో కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమెరికా మాంద్యం దెబ్బ.. ఐటీలో వేతన కోతల కలవరం
    అన్ని రంగాలూ కరోనా ప్రభావంతో కుదేలై భవిష్యత్తుపై ఆందోళన నెలకొన్నప్పుడు ఐటీ రంగం చేతినిండా ప్రాజెక్టులతో కళకళలాడుతూ కనిపించింది. ఉద్యోగులకు ఇంటి నుంచి పని విధానం, అదనపు ప్రోత్సాహకాలతో ఉజ్జ్వలంగా వెలిగింది. నిర్వహణ, రవాణా వ్యయాలను తగ్గించుకొన్న కంపెనీలకు బలహీనమైన రూపాయి కారణంగా మారకం రేటు కలిసివచ్చి మరింతగా లాభపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టీమ్​ ఇండియాను వీడని సమస్యలు.. హైదరాబాద్​లో గట్టెక్కేనా..?
    India Australia T20 Series : టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తోంది.. పొట్టి కప్పు సంగ్రామానికి సరిగ్గా నెల కూడా లేదు.. కానీ ఇప్పటికీ టీమ్‌ఇండియాను సమస్యలు వదలడం లేదు. బ్యాటింగ్‌లో నిలకడ లేమి. బౌలింగ్‌లో నిలకడగా వైఫల్యం జట్టు సన్నద్ధతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ నేపథ్యంలో మరో కీలక సమరానికి సిద్ధమైంది భారత జట్టు. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌ను నిర్ణయించే మ్యాచ్‌ ఆదివారమే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'హరిహర వీరమల్లు' మరో అప్టేట్​.. కమల్​ హసన్​ రెమ్యునరేషన్​ రూ.150కోట్లు!
    దక్షిణాది నుంచి పాన్​ ఇండియా చిత్రాలు జోరు కొనసాగుతోంది. ప్రముఖ నటుడు కమల్ హసన్ చిత్రం భారతీయుడు2 షూటింగ్​ రీస్టార్ట్​ అయ్యింది. ఈ సినిమాపై ఓ వార్త కోలీవుడ్​ వర్గాల్లో నానుతోంది. తెలుగు పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ నటిస్తున్న 'హరహర వీరుమల్లు' సినిమా గురించి మరో అప్డేట్​ ఇవ్వనుంది చిత్ర యూనిట్​. ఆ విశేషాలేంటో చూద్దాం..పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details