ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM - ap top ten news

ఏపీ ప్రధాన వార్తలు

Top News 7pm
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Sep 21, 2022, 7:01 PM IST

  • వైకాపా శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ ఎన్నిక చెల్లదు: సీఈసీ
    CEC ON JAGAN : వైకాపా శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ ఎంపిక చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను ఎన్నుకున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించిన సీఈసీ.. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరగాలని స్ఫష్టం చేసింది.
  • Lokesh: తెదేపా అధికారంలోకి వచ్చాక... వర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్​ పేరు: లోకేశ్​
    Nara Lokesh: తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆరోగ్య విశ్వవిద్యాలయానికి మళ్లీ ఎన్టీఆర్​ పేరు పెడతామని నారా లోకేశ్‌ ప్రకటించారు. ఇది జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వ తీరు అత్యంత దారుణమని లోకేశ్ మండిపడ్డారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి చెందిన రూ.400 కోట్ల నిధులు జగన్ కొట్టేశారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • MP RRR: ఎన్టీఆర్‌ యూనివర్సిటీకి.. వైఎస్సార్‌కు సంబంధమేంటి?: రఘురామ
    MP RRR : ఎన్టీఆర్​ వర్సిటీకి, వైఎస్సార్​కి సంబంధం ఏంటని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఎన్టీఆర్​ పేరు మార్చి వైఎస్సార్​ పేరు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. వైఎస్సార్​కు సంబంధం లేని సంస్థలకు ఆయన పేరు పెట్టడమేంటని మండిపడ్డారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రభుత్వ వైఫల్యాల దృష్టి మరల్చేందుకే.. పేరు మార్పు : సీఎం రమేశ్​
    BJP MP CM RAMESH : ఎన్టీఆర్‌ అంటే ఆంధ్రులందరికీ ప్రత్యేకమైన అభిమానం.. హెల్త్‌ యూనివర్సిటీకి ఉన్న ఆయన పేరును తొలగించడం ఒక పిచ్చి చర్య అని భాజపా ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయకపోతే.. ఉద్యమం ఉద్ధృతం: సర్పంచులు
    Sarpanches Fasts : పంచాయతీలో నిధులు లేకపోవడంతో గ్రామ పరిపాలన భారంగా మారిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెనక్కి తీసుకున్న ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ రిలే నిరహార దీక్షలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'దేశం ఎటువైపు పోతోంది?'... సుప్రీంకోర్టు ఆవేదన
    విద్వేషపూరిత ప్రసంగాలపై మీడియాకు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. దేశం ఎటువైపు వెళ్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. టీవీలో జరిగే చర్చల్లో యాంకర్లకు పెద్ద బాధ్యత ఉందని..కానీ టీవీ యాంకర్లు అతిథికి సమయం కూడా ఇవ్వరని అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'పీఎం కేర్స్​ ఫండ్​' ట్రస్టీగా రతన్​ టాటా.. వారిపై మోదీ ప్రశంసలు
    PM Cares fund: పీఎం కేర్స్​ ఫండ్​ ట్రస్టీలుగా వ్యాపార దిగ్గజం రతన్ టాటా, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ కేటీ థామస్ సహా మరికొందరు ప్రముఖులు చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దిల్లీలో జరిగిన సమావేశానికి వారంతా హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మానవులు విశ్వవ్యాప్తం'.. అంతరిక్ష నివాసానికి నాసా ఏర్పాట్లు.. కీలక ప్రకటన
    అంతరిక్షంలో మానవుల ఉనికిని విస్తృతం చేయాలన్న లక్ష్యంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కీలక బ్లూప్రింట్​ను విడుదల చేసింది. అంతరిక్ష ప్రయాణాలు, నివాసం; చంద్రుడు, మార్స్​పై అవసరమయ్యే మౌలిక సదుపాయాల గురించిన వివరాలను అందులో పొందుపర్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్​​పై ఐసీసీ కీలక ప్రకటన
    ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్​పై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. 2021-23, 2023- 25ఫైనల్ మ్యాచ్‌లను ఏ స్టేడియంలో నిర్వహించబోయేది తెలిపింది. ఐసీసీ 2021-23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌ను లండన్‌లోని ఓవల్‌ మైదానంలో నిర్వహిస్తామని పేర్కొంది. ఇక 2023- 25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​ వేదికను లార్డ్‌ వేదికగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'చిరుతో అలా చేయాలన్న కోరిక ఉండిపోయింది.. కృష్ణంరాజు వల్లే ఇదంతా'
    సీనియర్​ ఎన్టీఆర్​, కృష్ణంరాజు సహా పలు హీరోలతో తనకున్న అనుబంధాన్ని తెలిపారు సీనియర్​ నటి గీత. చిరంజీవితో అలా చేయాలన్న కోరిక ఉండిపోయిందని చెప్పారు. ఆ సంగతులు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details