ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Top News: ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM - ap top ten news

ఏపీ ప్రధాన వార్తలు

Top News
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Sep 9, 2022, 11:00 AM IST

  • ధర్మాన్ని కాపాడుకోవాలంటే త్యాగాలు తప్పవు: చంద్రబాబు
    Chandrababu Released Book: అమరావతి రైతుల త్యాగం గొప్పదని.. ఆ త్యాగం వృథాగా పోదన్నారు చంద్రబాబు. సీనియర్​ జర్నలిస్ట్​ కందుల రమేశ్​ రచించిన 'అమరావతి వివాదాలు-వాస్తవాలు' పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు.. 5కోట్ల మంది ప్రజలు అమరావతి పరిరక్షణకు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Harassments మాటలే.. ఈటెలు!
    Harassments: అనేక కార్యాలయాలు, పని ప్రదేశాల్లో ఉద్యోగిణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేధింపులు తప్పడం లేదు. చెప్పుకొంటే పరువు పోతుందనో.. ఉపాధికి నష్టమనో.. భయంతో ఎంతో మంది మౌనంగా భరిస్తుండగా- ఆ పరిస్థితిని అలుసుగా తీసుకునే కామాంధులు మరింత రెచ్చిపోతున్నారు. తొలుత మాటలతో ఆరంభించి.. తర్వాత ఒత్తిళ్లు, చివరకు వేధింపులు.. బెదిరింపులకూ వెనుకాడటం లేదు. జిల్లాలో గతంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వేధింపుల ఉదంతాలు వెలుగు చూశాయి.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Penna River పెన్నానదికి భారీగా వరద
    Penna River Heavy Floods: పెన్నానదికి భారీగా వరదనీటి విడుదల కొనసాగుతోంది. వరద ఉధృతి వల్ల పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బంగాళాఖాతంలో అల్పపీడనం,
    Telangana Weather Updates : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రాంతం వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో శుక్ర, శనివారాల్లో భారీ వర్షపాతాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మద్యం సేవించి స్కూల్​కు టీచర్​.. విద్యార్థులను తిడుతూ, కొడుతూ.. చివరకు
    మద్యం సేవించి పాఠాలు బోధిస్తున్న ఓ ఉపాధ్యాయురాలిని అధికారులు సస్పెండ్ చేశారు. నిత్యం మద్యం సేవించి ఉపాధ్యాయురాలు పాఠశాలకు వస్తుండేవారు. కారణం లేకుండానే విద్యార్థులను కొట్టడం, తిట్టడం, ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగుతుండేవారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 50వేల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు
    Corona Cases in India : దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా ఉంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 6,093 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 6,768 మంది కరోనా నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తైవాన్‌కు మరోమారు అమెరికా ప్రతినిధి బృందం... కీవ్‌లో బ్లింకెన్‌ ఆకస్మిక పర్యటన
    అమెరికాకు చెందిన మరో ప్రతినిధి బృందం తైవాన్‌ను సందర్శించింది. ఈ సారి చైనాకు మరింతగా చిర్రెత్తేలా చేసింది. మరోవైపు అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి అంటోనీ బ్లింకెన్‌ అకస్మాత్తుగా ఉక్రెయిన్‌కు పయనమయ్యారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • క్రెడిట్‌ కార్డ్ ఫ్రీ అనుకుంటున్నారా? అయితే పొరబడ్డట్టే!
    మనం ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే అప్పుడప్పుడు క్రెడిట్‌ కార్డును వాడుతుంటాం. బ్యాంకులు ఈ వెసులుబాటును కొత్తగా ఉద్యోగంలో చేరినవారితో పాటు, ఇప్పటి వరకు కార్డు తీసుకోని తమ పాత ఖాతాదారులకూ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మూడేళ్ల నిరీక్షణకు తెర.. విరాట్‌ కెరీర్‌లో 71వ శతకం.. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్​
    తేదీ: సెప్టెంబర్‌ 8, 2022 వేదిక: దుబాయ్‌ స్టేడియం సమయం: రాత్రి 8 గంటల 53 నిమిషాలు 19వ ఓవర్‌ రెండో బంతిని స్టాండ్స్‌లోకి పంపిన కోహ్లీ ముఖంపై పెద్ద భారాన్ని తొలగించుకున్నట్లుగా ఓ చిరునవ్వు. అతడి బ్యాట్‌ గాల్లోకి లేచింది. స్టాండ్స్‌లోని అభిమానులు.. డగౌట్లోని సహచర ఆటగాళ్లు లేచి నిలబడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రెక్కలు కట్టుకొని వందరోజుల్లో మీ ముందుకు 'అవతార్​ 2'
    అవతార్‌తో ప్రేక్షకుల్ని పండార గ్రహంలో విహరింపజేసిన జేమ్స్‌ కామెరూన్‌, ఇప్పుడు 'అవతార్‌ 2'తో మరో సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన కొత్త కబురుని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details