- CM Jagan: రాష్ట్రంలో మెరుగైన విద్యావ్యవస్థ కోసం పని చేస్తున్నాం: సీఎం జగన్
CM Jagan on Education: ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన విద్యా విధానం ఉండాలనే లక్ష్యంతో...మూడేళ్లలో ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని సీఎం జగన్ అన్నారు. విజయవాడలో గురపూజోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన...టీచర్ల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించే పరిస్థితి రావాలన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుంటే...ప్రతిపక్షం టీచర్లను రెచ్చగొట్టేందుకు యత్నిస్తోందని సీఎం ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మారణాయుధాలతో దాడి చేస్తే.. నామమాత్రపు కేసులా?: తెదేపా
TDP complaints to cp: రౌడీయిజాన్ని నమ్ముకున్నవాళ్లు ఎవరూ బాగు పడలేదని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా నేతల దాడిలో కన్ను కోల్పోయిన చెన్నుపాటి గాంధీని పరామర్శించిన ఆయన.. ఓటమి భయంతోనే అధికార పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు దాడిలో పాల్గొన్న వారి నేరచరిత్రను తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ పోలీస్ కమిషనర్‌కు అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- JP on debts: ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి: జయప్రకాశ్ నారాయణ
Jayaprakash Narayana on debts: రోజువారీ అవసరాలకు ప్రభుత్వాలు అప్పులు చేస్తే అవే మన పిల్లలకు శాపంగా మారతాయని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాన్ని మార్చేందుకు ప్రభుత్వం ఓ ప్రయత్నం చేస్తోందని ఆయన కితాబిచ్చారు. ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కోనసీమలో కాల్పుల కలకలం.. దర్యాప్తు వేగవంతం
GUN FIRING CASE UPDATES : కోనసీమలో జరిగిన కాల్పుల ఘటనలో దుండగులు వదిలిపెట్టిన నాటు బాంబులు, తుపాకీలు, జామర్, మొదలగువాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాటు బాంబులను నీటిలో నానబెట్టి.. భూమిలో పాతిపెట్టారు. మిగిలిన సామగ్రిపై ఉన్న వేలిముద్రలను తీసుకుని సీజ్ చేశారు. ఆర్థిక లావాదేవీలా, లేక వ్యాపారాల్లో ఏమైనా గొడవలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పులికే పంజా విసిరి.. కుమారుడ్ని కాపాడుకున్న మహిళ..
కన్న తల్లి ప్రేమ ఎంత గొప్పదో అని చెప్పేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ. మగువల తెగువ ఎంతటిదో తెలిపేందుకు ఈ ఘటన ఓ మచ్చుతునక. అద్భుత ధైర్య, సాహసాలతో పులికే పంజా విసిరి తన 15 నెలల చిన్నారిని కాపాడుకుంది ఈ తల్లి. అసలేం జరిగిందంటే..పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాహుల్ హామీల వర్షం.. రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ
Rahul Gandhi Ahmedabad : ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుజరాత్లో.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ. 3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. భాజపా.. వ్యాపారవేత్తలకు కొమ్ముకాస్తుందని, రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రిషి సునాక్ ఓటమి.. బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్.. మోదీ ట్వీట్
Liz Truss becomes British Prime Minister : బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. సోమవారం వెల్లడైన తుది ఫలితాల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌పై ఆమె విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, ప్రధానిగా లిజ్ ట్రస్‌ను ఎన్నుకున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఆరు వారాలుగా హోరాహోరీ ప్రచారంతో పాటు అంతర్గతంగా పోలింగ్ జరగ్గా.. తాజాగా తుది ఫలితాలు వెల్లడయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రతిష్ఠ కోసమే సైరస్ పోరు.. రతన్ టాటా చొరవతో ఛైర్మన్‌గా మారి..
ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థల్లో ఒకటైన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వారసుల్లో ఒకరైన సైరస్ పల్లోంజీ మిస్త్రీ హఠాన్మరణం గ్రూప్‌కే కాక వ్యాపార ప్రపంచానికే తీరనిలోటు. అయితే, టాటా గ్రూప్ ఛైర్మన్ పదవిని స్వీకరించడంతోనే ఆయనకు ప్రాచుర్యం లభించింది. టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ ఎంపికే కాదు.. ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించిన విధానం కూడా కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వ్యాపార దిగ్గజం ప్రస్థానం గురించి ఓ సారి చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్పెషల్ పర్సన్‌కు 'టీచర్స్ డే' విషెస్ చెప్పిన గంగూలీ.. ఎవరంటే..?
Sourav Ganguly On Teachers Day : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డెబో మిత్రా, జాన్ రైట్, గ్యారీ కిర్‌స్టెన్‌తోపాటు గ్రెగ్ చాపెల్‌కు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ శుభాకాంక్షలు చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. ఈ సందర్భంగా తన క్రికెట్ కెరీర్‌లో చోటుచేసుకున్న ఎత్తుపల్లాలను గంగూలీ గుర్తు చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆసక్తిగా 'ఆ అమ్మాయి..' ట్రైలర్.. లేడీ బౌన్సర్‌గా తమన్నా
Babli Bouncer Trailer : మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'బబ్లీ బౌన్సర్' ట్రైలర్ విడుదల అయ్యింది. సుధీర్ బాబు, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు మహేశ్‌బాబు ట్రైలర్‌ని విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.