- లోకేశ్ పలాస పర్యటనలో హైడ్రామా, నేతల అరెస్టు
తెలుగుదేశం నేత నారా లోకేశ్ పలాస పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. స్థానిక నేత పరామర్శకు వెళ్తున్నలోకేశ్ను శ్రీకాకుళంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తెదేపా శ్రేణులు భగ్గుమన్నాయి. తర్వాత లోకేశ్‌ను విడిచిపెట్టినప్పటికీ ఆయన మీడియా సమావేశాన్ని అడ్డుకున్నారు.
- మరోసారి వైకాపా అధికారంలోకి రాకూడదనేదే మా విధానం
Pawan Kalyan comments రాష్ట్రంలోనూ మూడో ప్రత్యామ్నాయం ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వైకాపా, తెదేపాకు కొమ్ము కాసేందుకు తాము సిద్దంగా లేమని వెల్లడించారు. వైకాపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాకూడదనేదే తమ విధానమని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ఎన్నికల వ్యూహం చెబుతానని వెల్లడించారు.
- రాష్ట్రాన్ని సీఎం జగన్ అడ్డగోలుగా దోచేస్తున్నారన్న కేంద్రమంత్రి
రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలు నడిపిస్తున్నాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. యువత జీవితాలతో ఆడుకునే గంజాయిపై సీఎం ఉక్కుపాదం మోపకపోతే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన బీజేవైఎం యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఆయన జగన్‌కు జీఎస్టీ కంటే జేఎస్టీ ట్యాక్స్‌పైనే ఎక్కువ ఆసక్తి ఉందని ఎద్దేవా చేశారు.
- కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ఇది ప్రారంభం
తెలంగాణలోని మునుగోడులో నిర్వహించిన భాజపా సమరభేరిలో పాల్గొన్న అమిత్‌షా.. రాజగోపాల్‌రెడ్డిని కాషాయ కండుపా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మునుగోడు అభివృద్ధికి మోదీ సర్కారు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో భాజపా ప్రభుత్వం వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
- సీఎం కాన్వాయ్‌పై దాడి, నాలుగు వాహనాల అద్దాలు ధ్వంసం
CM convoy stone pelting బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో నాలుగు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.
- బైక్‌ను ఢీకొట్టిన కారు, గాల్లోకి ఎగిరిపడ్డ భార్యాభర్తలు, ఒకరు మృతి
కేరళ మలప్పురం జిల్లా తిరుర్ రోడ్డులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో అబ్దుల్ ఖాదర్(48) అనే వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
- పుతిన్ సన్నిహితుడి కుమార్తె హత్య, కారు బాంబు పేల్చి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన అలెగ్జాండర్ డుగిన కుమార్తెను కారు బాంబు పేల్చి హత్య చేశారు. ఈ ఘటన మాస్కోలో శనివారం జరిగింది.
- క్రెడిట్ కార్డు లిమిట్ పెంపుతో లాభమా, నష్టమా
మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా, కార్డు పరిమితి పెంచుతామని బ్యాంకుల నుంచి కాల్స్ వస్తున్నాయా, ఆఫర్ అంగీకరించాలా వద్దా అలోచిస్తున్నారా, అయితే ఇది మీ కోసమే. కార్డు పరిమితి ఎలా పెంచుకోవాలి, దాని వల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనే విషయాలు తెలుసుకుందాం.
- బాబర్ ఆజమ్ వర్సెస్ విరాట్ కోహ్లీ, వీరిలో ఎవరు బెస్ట్
పాక్ టీమ్‌లో ఏస్ ఆటగాడైన బాబర్ ఆజమ్, టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీలో ఎవరు బెస్ట్ అనే అంశంపై ఆసీస్ మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ స్పందించాడు. వీరిద్దరిలో ఎవరు ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ అనే విషయంపై తన అభిప్రాయం వెల్లడించాడు.
- చిరు ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్, గాడ్ ఫాదర్ టీజర్ వచ్చేసింది
మెగా అభిమానులు ఎదురుచూస్తున్న టీజర్ విడుదలైంది. చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్ టీజర్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది.