- పోలవరం నిర్వాసితుల కష్టాలు ప్రధాని మోదీకి వివరించి.. పరిహారం వచ్చేలా చూస్తా: సీఎం
CM JAGAN : పోలవరం నిర్వాసితుల కష్టాలు ప్రధాని మోదీకి వివరిస్తానని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. విలీన మండలాల్లో పర్యటిస్తున్న జగన్.. ప్రధానితో చెప్పి వీలైనంత త్వరగా పరిహారం వచ్చేలా చూస్తానని స్పష్టం చేశారు. కేంద్రం త్వరగా నిధులిచ్చి ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని కోరారు.
- మంగళగిరిలో 'బాదుడే బాదుడు'.. నిత్యావసరాల ధరలపై లోకేశ్ కరపత్రాల పంపిణీ
LOKESH: 'బాదుడే బాదుడు' కార్యక్రమలో భాగంగా.. మంగళగిరి నియోజకవర్గంలోని రత్నాల చెరువు 22వ వార్డులోని ప్రజలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పలకరించారు. వారి సమస్యలపై ఆరా తీశారు. వైకాపా-తెదేపా పాలనలో నిత్యావసరాల ధరలు ఏవిధంగా ఉండేవో తెలిపేలా కరపత్రాలు పంపిణీ చేశారు.
- విశాఖ బీచ్‌లో వివాహిత అదృశ్యం.. గాలింపునకు ఎంత ఖర్చయ్యిందంటే..!
VSP Woman missing: విశాఖ బీచ్‌లో గల్లంతైందని భావించిన యువతి ఉదంతం కొత్త మలుపు తిరిగింది. ఆమె కోసం నౌకదళ హెలికాప్టర్లు అవిశ్రాంతంగా గాలిస్తే.. ఆమె ఆచూకీ అనూహ్యంగా నెల్లూరులో వెలుగు చూసింది. బీచ్‌లో భర్తను ఏమార్చి సన్నిహితుడితో నెల్లూరు చేరడం చర్చనీయాంశమైంది..
- 30 ఏళ్ల వివాహిత.. 15 ఏళ్ల బాలుడి కిడ్నాప్, సహజీవనం
MISSING CASE: సభ్య సమాజం తలదించుకునే ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. ఆమెకు పెళ్లై నలుగురు పిల్లలు ఉన్నారు. భర్త అనారోగ్యం కారణంగా ఇంట్లో ఉండటం లేదు. ఏమి తెలియాలో తోచక.. ఎదురింట్లో నివాసం ఉంటున్న 15 ఏళ్ల బాలుడిపై ఆమె కన్నేసింది. ముందుగా బాలుడిని పరిచయం చేసుకుని.. అతడితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది.
- సోనియాకు ఈడీ 110 ప్రశ్నలు.. అన్నింటికీ ఒకటే సమాధానం!
Sonia Gandhi ED probe: మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విచారణ ముగిసింది. మూడు రోజుల పాటు విచారించిన ఈడీ.. అవసరమైనప్పుడు మరోసారి పిలుస్తామని తెలిపింది. మరోవైపు, ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- సస్పెన్షన్‌పై విపక్షాల పోరుబాట.. ఆ షరతుకు ఒప్పుకుంటే ఎత్తివేస్తామన్న కేంద్రం
Parliament session monsoon 2022: ఎంపీల సస్పెన్షన్‌పై విపక్షాలు పోరు బాట పట్టాయి. 25 మంది సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 50 గంటల నిరసన ప్రారంభించాయి. అయితే.. తమ షరతుకు ఒప్పుకుంటే విపక్షాలు కోరినట్టు చేస్తామని స్పష్టం చేసింది అధికార పక్షం.
- పుతిన్‌కు తీవ్ర అస్వస్థత.. వైద్యుల్లో టెన్షన్ టెన్షన్!
Putin health news today: రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. పారామెడికల్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఆయన గదికి చేరుకున్న వైద్యులు మూడు గంటలపాటు చికిత్స అందించినట్లు సమాచారం.
- BSNLకు భారీ ప్యాకేజీ.. ఆదుకునేందుకు కేంద్రం నిర్ణయం
నష్టాల ఊబిలో ఉన్న బీఎస్ఎన్ఎల్ను ఆదుకునేందుకు కేంద్రం ముందడుగు వేసింది. సంస్థ కోసం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. 4జీ సేవల విస్తరణ కోసం స్పెక్ట్రమ్ కేటాయించనున్నట్లు తెలిపింది. మరోవైపు, రెండోరోజు 5జీ వేలంలో రూ.1.49 లక్షల కోట్ల బిడ్లు దాఖలయ్యాయి.
- కామన్వెల్త్ గేమ్స్.. ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
Commonwealth Games 2022: మరో రోజులో బర్మింగ్హమ్ వేదికగా ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈ ప్రతిష్టాత్మకమైన క్రీడలు గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం...
- ఏజ్ 52.. ఫస్ట్ మూవీ బడ్జెట్ రూ.60కోట్లు.. ఎవరీ 'లెజెండ్ శరవణన్'?
Arulsarvanan The Legend movie: బ్యాక్‌గ్రౌండ్, బ్యాంక్ బ్యాలన్స్ ఉండి సినీఇండస్ట్రీలో అడుగుపెట్టినవారు ఎందరో. హీరో మెటీరియల్ కాకపోయినా టాలెంట్‌తో సంబంధం లేకుండా.. సినిమాపై ఉన్న ఆసక్తితో ఎంతోమంది నటుడిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడా ఆ కోవలోనే తన లక్ పరీక్షించుకోవడానికి ఓ బిజ్నెస్మ్యాన్ హీరోగా గ్రాండ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయనే ది లెజెండ్ శరవణన్.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM - ఏపీ ప్రధాన వార్తలు
ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు
top news