- నోరుంటే పశువులు సైతం మెచ్చుకునేలా వరద సాయం: సీఎం జగన్
CM TOUR IN KONASEEMA: వరద నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేసి.. ఈ సీజన్లోనే పరిహారం చెల్లిస్తామని సీఎం జగన్ కోనసీమలోని బాధితులకు హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. జి.పెదపూడిలంక వద్ద వంతెన నిర్మిస్తామన్నారు. వరద సాయం అందని ఒక్కరిని కూడా చంద్రబాబు చూపించలేకపోయారని జగన్ విమర్శించారు.
- చంద్రబాబు ఇంటికి మోహన్‌బాబు.. సినీ, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
Mohanbabu Meet CBN:ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు తెదేపా అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన మోహన్‌బాబు.. తాజా రాజకీయాలపై దాదాపు గంటకుపైగా చర్చించుకున్నారు.
- సీఎం జగన్ పర్యటన వారిలో భరోసా నింపలేకపోయింది: నాదెండ్ల
Nadendla on CM Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన బాధితుల్లో భరోసా నింపలేకపోయిందని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ అన్నారు. ముందుగా ఎంపిక చేసిన వారితోనే ముఖ్యమంత్రి మాట్లాడారని.. వేరే వాళ్ల నుంచి కనీసం వినతి పత్రాలు కూడా తీసుకోలేని స్థితిలో సీఎం ఉన్నారన్నారు. వరద బాధితులకు ఏం సాయం చేశారో చెప్పకుండా విపక్షాలను విమర్శించటానికే ముఖ్యమంత్రి పరిమితమయ్యారని ఆరోపించారు.
- Live Video: అందరూ వద్దన్నా వెళ్లాడు.. కానీ..
Man vanished in Canal: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును చూసి అందరూ.. భయపడుతుంటే ఒక్కడు మాత్రం ఆ వరదకే సవాలు విసురుతూ వాగు దాటే ప్రయత్నం చేశాడు. ఒడ్డున ఉన్నవాళ్లు ఊహించినట్టుగానే.. నాలుగు అడుగులు వేసాడో లేదో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు.
- షూటింగ్స్ బంద్!.. ఆ 8 అంశాలపై నిర్మాతల మండలి కీలక నిర్ణయం
తెలుగు సినీ నిర్మాతల కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి థియేటర్లో విడుదలైన భారీ చిత్రాలు పదివారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది.
- సోనియాను ఆరు గంటలు ప్రశ్నించిన ఈడీ.. మరోసారి
Sonia Gandhi ED: నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాను మంగళవారం ఆరు గంటల పాటు ఈడీ విచారించింది. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసిన ఈడీ.. మరోసారి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. మరోవైపు, ఈ విచారణను వ్యతిరేకిస్తూ దిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు చేపట్టిన నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు.
- చెస్ ఆడుతుండగా రోబో 'పైశాచికం'.. పిల్లాడి వేలు విరిచేసిన చిట్టి!
Robot Chess finger break : ఏడేళ్ల బాలుడితో చెస్ ఆడుతున్న రోబో.. ఒక్కసారిగా ఆ పిల్లాడి వేలు విరిచేసింది. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారు ఖంగుతిన్నారు. రోబో చెర నుంచి బాలుడ్ని విడిపించారు.
- స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. నేటి లెక్క ఇలా...
Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా, వెండి ధర తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?
- బ్యాడ్ న్యూస్.. కామన్వెల్త్ గేమ్స్‌కు నీరజ్ చోప్రా దూరం
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఈ మెగా పోటీలకు దూరం అయ్యాడు. ఫిట్నెస్ కారణంగా నీరజ్ పోటీల్లో పాల్గొనడం లేదని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) ప్రకటించింది.
- నాగార్జునే స్ఫూర్తి.. సైకిల్ చైన్‌తో భయపెట్టేవాడిని: స్టార్ హీరో
Kicha Sudeep Vikranth Rona: 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' లాంటి చిత్రాల పోస్టర్లను తమ అన్నపూర్ణ స్టూడియోస్‌లో గర్వంగా పెట్టుకున్నామని, ఆ జాబితాలో కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' త్వరలో చేరుతుందన్నారు ప్రముఖ నటుడు నాగార్జున. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై, ఆయన మాట్లాడారు. ఇక సుదీప్ మాట్లాడుతూ.. నాగ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.