ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుగ్రామాలను చుట్టేసిన గోదావరి.. Godavari: గోదావరి తీర ప్రాంతాల్ని వరద ముంచెత్తుతోంది. శనివారం ఉదయం నుంచి గంటగంటకూ గ్రామాల్లో ముంపు ప్రాంతం పెరుగుతోంది. శనివారం రాత్రి 11 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీవద్ద 25.59 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. బ్యారేజీలో 21.6 అడుగుల నీటి మట్టం దాటింది.పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్‌కు చట్టబద్ధతే లేదు..High Court: చట్టబద్ధత లేని ఏపీ పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్ (పీఎస్‌వో) ఆధారంగా రౌడీషీట్ తెరవడం, వాటిని కొనసాగించడాన్ని తప్పుపడుతూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రౌడీషీట్ తెరవడం, నిఘా పెట్టడం, ఠాణాల్లో ఫొటోల ప్రదర్శన సరికాదని పేర్కొంది. ఆ చర్యలు గోప్యత హక్కును హరించడమేనని తేల్చిచెప్పింది.వరద బాధితుల్ని వదిలేశారు.. గోదావరి భారీ వరద నేపథ్యంలో పోలవరం విలీన మండలాల్లో యంత్రాంగం అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వరద తీవ్రత గురించి అధికారులు తెలియజేయలేదు. పునరావాస కాలనీలు నిండిపోయాయని, తమకు అక్కడ చోటులేకే సొంతంగా గుడిసెలు వేసుకుంటున్నామని పేద నిర్వాసితులు చెబుతున్నారు.ఏపీ భవిష్యత్తుకు వైకాపా ప్రభుత్వం హానికరం..తూర్పుగోదావరి జిల్లా చైతన్యవంతమైనదని.. రాష్ట్రంలో మార్పు రావాలంటే గోదావరి జిల్లాలతోనే సాధ్యమవుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన కౌలు రైతు భరోసాయాత్రలో భాగంగా.. కోనసీమ జిల్లా మండపేటలో ఆత్మహత్య చేసుకున్న 52 మంది కౌలు రైతుల కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శక్తి గోదావరి జిల్లాలకు ఉందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన జెండా ఎగరడం ఖాయమని, ఎవరివైపు నిలబడతారో నిర్ణయించుకోవాలని ఆ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు సర్వం సిద్దం.. Neet Exam: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ జరగనుంది. రాష్ట్రం నుంచి సుమారు 60వేల మంది అభ్యర్థుల కోసం.. 25 పట్టణాలు, నగరాల్లో.. 115 కేంద్రాలను సిద్దం చేశారు. ఈ ఏడాది పరీక్ష సమయాన్ని 20 నిమిషాలు పెంచారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు నిర్వహించనున్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని ఎన్టీఏ వెల్లడించింది.సాధారణ రైతు కుటుంబం నుంచి ఉపరాష్ట్రపతి వరకు..Venkaiah Naidu: సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఉపరాష్ట్రపతి హోదా వరకు ఎదిగిన వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో వాక్చాతుర్యంతో దేశవ్యాప్తంగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న నేతగా ఆయనకు విశిష్ట స్థానం ఉంది.చైనా దూకుడుకు కళ్లెం.. 'ఆకస్' నెక్ట్స్ టార్గెట్ భారత్.. చైనాకు కళ్లెం వేసేందుకు ఏర్పడిన 'ఆకస్' కూటమి భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతోంది. భారత్‌లో మైనారిటీల హక్కులకు భంగం వాటిల్లుతోందని విమర్శిస్తోంది. ఆకస్ కూటమిలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా సభ్య దేశాలు. భారత్‌లో మతస్వేచ్ఛకు భంగం కలుగుతోందంటూ అమెరికా మొసలి కన్నీరు కారుస్తుంటే- బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో సిక్కు వర్గానికి చెందిన కొందరు ఖలిస్థాన్ వాదాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఆ ఆరుగురి ఆందోళన.. ప్రభుత్వాన్ని పడగొట్టింది!Sri Lanka Crisis: అధికారమంతా ఒక్క కుటుంబం చేతిలోనే.. అవినీతిమయమైన పాలన.. రోజురోజుకూ పరిస్థితులు దిగజారుతూ నిత్యావసరాలు లభ్యం కాక ప్రపంచం ముందు చేతులు చాచాల్సిన దుస్థితి.. ఇవన్నీ శ్రీలంక ప్రజల్లో నిరసన జ్వాలలు రగిల్చాయి.క్రికెట్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ICC FTP 2023 to 2027: ఐపీఎల్ కోసం ఎఫ్టీపీ క్యాలెండర్లో రెండున్నర నెలలను ఐసీసీ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా రోజులు కేటాయించడంపై బీసీసీఐకి ఇప్పటికే అనేక దేశాల మద్దతు లభించింది. విదేశీ ఆటగాళ్లు చాలా మంది ఐపీఎల్ ద్వారా ఇప్పటికే భారీ మొత్తంలో ఆర్జిస్తున్నారు.'అసలు వేట మొదలైంది'.. 'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్ రిలీజ్రవితేజ హీరోగా శరత్ మండవ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' . సుధాకర్ చెరుకూరి నిర్మాత. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ కథానాయికలు. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జులై 29న విడుదల కానుంది.