- త్వరలో సీఎం జగన్ ప్రజాదర్బార్.. క్యాంపు కార్యాలయంలో రోజూ వినతుల స్వీకరణ
CM Jagan Prajadarbar: ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించేందుకుగాను త్వరలో ‘ప్రజాదర్బార్‘ను ముఖ్యమంత్రి జగన్ చేపట్టనున్నట్లు తెలిసింది. వారంలో ఐదు రోజులపాటు.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన విన్నపాలు స్వీకరించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ముర్ముకు మద్దతుపైనా వైకాపా చిల్లర రాజకీయం.. తెదేపా ఎంపీల ధ్వజం
TDP fires on YSRCP: సామాజిక న్యాయం కోసమే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు తెదేపా మద్దతు ప్రకటించిందని, దాన్ని కూడా వైకాపా నాయకులు వక్రీకరించి రాజకీయం చేయడం దిగజారుడుతనమని పార్టీ ఎంపీలు ధ్వజమెత్తారు. . తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- NIRF Rankings: ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో తెలుగురాష్ట్రాల వెనుకంజ
NIRF Rankings: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్)-2022 ర్యాంకుల్లో తెలుగురాష్ట్రాల విద్యాసంస్థలు వెనుకబడ్డాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ శుక్రవారం ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులను విడుదల చేశారు. ఓవరాల్ ర్యాంకుల్లో 2019లో 29వ స్థానంలో నిలిచిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రస్తుతం 71వ స్థానం దక్కింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నేడు కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన.. కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం
కోనసీమ జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 67 కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మండపేట రానున్నట్లు ఆపార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కౌలు రైతు భరోసా పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధం.. ఓటింగ్ ఎలా జరగనుందంటే..
Presidential election 2022: దేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉండే ఈ ప్రతిష్టాత్మక ఎన్నికలు, సాధారణ ఎన్నికలతో పోలిస్తే కాస్త భిన్నం. రాష్ట్ర అసెంబ్లీలే పోలింగ్ కేంద్రాలుగా మారనుండగా రాష్ట్రపతిని బ్యాలెట్ పద్దతిలో ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చట్టపరిధిలోకి డిజిటల్ న్యూస్!.. వర్షాకాల సమావేశాల్లో బిల్లు ఆమోదం?
Digital News Regulation: మీడియా బిల్లుకు కేంద్ర ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. డిజిటల్ న్యూస్‌ను ఆ బిల్లు పరిధిలోకి తీసుకువచ్చేందుకు అడుగులు వేస్తోంది. ఒకవేళ ఆ బిల్లు ఆమోదం పొందితే, ఇకపై తప్పుడు వార్తలను డిజిటల్ మీడియాలో ప్రసారం చేస్తే.. ఆ సైట్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం, జరిమానా విధించడం వంటి చర్యలుంటాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీలంక తదుపరి దేశాధినేత ఎవరో?.. రేసులో ఆ నలుగురు
Srilanka president: శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఈ నెల 20న కొలిక్కి రానుంది. రహస్య ఓటింగ్ విధానంలో ఎంపీలు.. దేశాధినేతను ఎన్నుకోనున్నారు. కొత్త అధ్యక్షుడు 2024 వరకు ఆయన అధికారంలో ఉంటారు. ప్రస్తుత ప్రధాని, తాత్కాలిక అధ్యక్షుడైన రణిల్ విక్రమసింఘే, విపక్ష నేత సాజిత్ ప్రేమదాస, వామపక్ష అనుకూల నేత దుల్లాస్ అలహప్పేరుమ తదితరులు దేశాధినేత పోటీదారుల్లో అగ్రభాగాన ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ద్రవ్యోల్బణంలోనూ డాలరుదే హవా.. బలపడుతున్న అమెరికా కరెన్సీ
అమెరికాలో 40 ఏళ్లలోనే ఎన్నడూ లేనంతగా ధరలు మండుతున్నాయి. జూన్‌లో ద్రవ్యోల్బణం 9.1 శాతంగా నమోదైంది. అదే మన దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతమే. యూరోను కరెన్సీగా వినియోగిస్తున్న 19 ఐరోపా దేశాల్లో కూడా జూన్ ద్రవ్యోల్బణం 8.6 శాతమే. అంటే మనదేశం, ఐరోపా కంటే అమెరికాలోనే ద్రవ్యోల్బణ భారం అధికంగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోహ్లీని తొలగించే దమ్ము ఏ సెలెక్టర్‌కు లేదు: పాక్ మాజీ కెప్టెన్
Kohli Rashid latif: కోహ్లీని తొలగించే సెలెక్టర్ ఇంకా పుట్టలేదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నాడు. విరాట్‌ను ఆఫ్‌సైడ్ బంతులను ఆడొద్దని చెప్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హంగులతో 'ఆదిపురుష్'.. షాకింగ్ క్యారెక్టర్‌తో రణ్‌బీర్.. దసరాకు వెంకటేశ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్', బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ 'యానిమల్', సీనియర్ హీరో వెంకటేశ్ కొత్త సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ సంగతులు ప్రచారంలో ఉన్నాయి. అవేంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు