- Rains: నేడు, రేపు భారీ వర్షాలు
Rains: రాష్ట్రంలో రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావాలతో.. సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైకాపా పాలనకు చరమ గీతం పాడాలి.. ఆ పార్టీ అంటే అందుకే చిరాకు: పవన్
వైకాపా పాలనకు చరమగీతం పాడాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కిందిస్థాయి నేతలు పార్టీ అధినేతను మించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని.. వైకాపా అంటే అందుకే చిరాకు అని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పోరాటం చేస్తున్నందుకు వైకాపా నేతలు తన ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నారని పవన్ ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జగనన్న కాలనీకి దారేది? ఇంటికి నీరేది?.. లబ్ధిదారులకు తప్పని అవస్థలు
మౌలికవసతులు లేక జగనన్న కాలనీ లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు, విద్యుత్తు సొంతంగా సమకూర్చుకోవాల్సి వస్తుండటంతో పెనుభారం పడుతోంది. మొదటి విడతలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న లేఅవుట్లు 10,500 కాగా.. వీటిలో 8 వేల లేఅవుట్లకు మాత్రమే నీరు, విద్యుత్తు సౌకర్యం సమకూరాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నేటి నుంచి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.. 35 వేల మంది విధులకు దూరం
తొమ్మిది ప్రధాన డిమాండ్లతో పారిశుద్ధ్య కార్మికులు నేటి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. దాదాపు 35వేల మంది విధులకు దూరం కానున్నారు. వర్షాల నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మెకు దిగడంతో ప్రజారోగ్యంపై ప్రభావం పడకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో కార్మికులు సమ్మెకు వెళ్లకుండా అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గోవాలో కాంగ్రెస్‌కు షాక్.. అజ్ఞాతంలోకి ఐదుగురు ఎమ్మెల్యేలు!
గోవాలో కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. మొత్తం 11 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో విపక్ష నేతగా ఉన్న మైఖేల్ లోబోను ఆ పదవి నుంచి తప్పించింది కాంగ్రెస్. లోబో, దిగంబర కామత్‌లు భాజపాతో కలిసి కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నేను జయలలిత సోదరుడ్ని.. ఆస్తిలో సగం వాటా నాదే'.. కోర్టులో వృద్ధుడి పిటిషన్
Jayalalitha Brother Vasudevan: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తాను సోదరుడినని పేర్కొంటూ కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడు కోర్టు మెట్లెక్కారు. ఆమె ఆస్తిలో సగం వాటా తనకు ఇవ్వాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లంకలో ఆగని నిరసనలు.. అఖిలపక్ష సర్కార్‌కు విపక్షాలు ఓకే
శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఓ అంగీకారానికి వచ్చాయి విపక్ష పార్టీలు. జులై 13న అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసిన అనంతరం.. తాము ప్రభుత్వ ఏర్పాటుచేస్తామని స్పష్టం చేశాయి. మరోవైపు.. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలని ప్రజలు నిరసనలు చేస్తూనే ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సెబీ నుంచి మార్కెట్ సమాచారం!.. పెట్టుబడుల్లో మూక ధోరణి తొలగించేందుకే
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మదుపర్లు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా 'మార్కెట్ నష్టభయం కారణాల వివరాల'ను తరచు వెల్లడించేలా సన్నాహాలు చేస్తోంది. నష్టభయం అంశాలన్నింటినీ సంస్థలు వెల్లడించాల్సిందేనని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జకోవిచ్ ఖాతాలో మరో వింబుల్డన్.. 21వ గ్రాండ్‌స్లామ్ కైవసం
Djokovic Wimbledon: అత్యంత ఉత్కంఠగా సాగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్ విజేతగా నిలిచాడు. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన కిర్గియోస్.. ప్రపంచ నెం.1 జకోవిచ్ చేతిలో 4-6,6-3,6-4,7-6(7-3) తేడాతో తేలిపోయాడు. మొదటి సెట్లో ఓడిన జకోవిచ్.. రెండు, మూడు సెట్లలో గెలుపొందాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సినీ పరిశ్రమకు భూతంలా 'ఓటీటీ''
Raghavendra Rao OTT: ప్రస్తుత రోజుల్లో థియేటర్లకు ప్రజలను రప్పించడం చాలా కష్టమవుతోందని అన్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. సినీ పరిశ్రమ పాలిట ఓటీటీ ఓ భూతంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. తాను సమర్పించిన 'పండుగాడ్' చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు