- విప్లవ జ్యోతి.. స్వరాజ్య సమర ఖ్యాతి.. మన అల్లూరి!
Alluri Sitarama Raju: అల్లూరి సీతారామరాజు ధైర్యం, తెగువ ఎనలేనిది. అల్లూరి త్యాగనిరతి చాలా గొప్పవని ఓ సారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన మహాత్మా గాంధీ ప్రశసించారు. ఆయన తిరుగుబాటుదారుడు కాదు.. యువతకు ఆదర్శప్రాయుడు అంటూ కీర్తించారు. స్థానిక సంస్థల అభివృద్ధి, మద్యపాన నిషేధం, అందరికీ విద్య వంటి మహోన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని అల్లూరి ముందుకు సాగారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నేతల ఆశీస్సులుంటే.. నచ్చిన చోటుకు బదిలీలు.. లేకుంటే..
రాష్ట్రవ్యాప్తంగా 47 మంది పురపాలక కమిషనర్లను ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తెచ్చుకున్నవారు నచ్చిన చోటుకు బదిలీ అయ్యారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యేల మాట వినని పలువురు కమిషనర్లను బదిలీ చేసి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా గాలిలో పెట్టడం బదిలీలపై నేతలకున్న పట్టును స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సర్కిళ్లే ప్రామాణికంగా బదిలీలు చేయాలి: గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్
Transfer: సొంత రెవెన్యూ డివిజన్ ప్రామాణికంగా కాకుండా సర్కిళ్ల ఆధారంగా బదిలీలు చేపట్టాలని.. వాణిజ్య పన్నులశాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆదివారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శాఖాపరంగా పునర్‌వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Loan apps: రుణ యాప్‌ల ఆగడాలు.. ఉసురు తీసుకుంటున్న బాధితులు
Loan Apps Case : ఒకటి కాదు రెండు కాదు రుణ యాప్‌ల ఆగడాలకు సంబంధించి ఎన్నో ఉదంతాలు. ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. వారి అరాచకపర్వానికి బాధితులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అవసరానికి డబ్బు తీసుకుని వడ్డీతో సహా తిరిగి చెల్లించినా.. రుణయాప్‌ల నిర్వాహకులు మాత్రం పాడు బుద్ధిని చూపించడం ఆపడంలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొత్త ముష్కరులపై ఉక్కుపాదం.. సగం మంది 6నెలల్లోపే హతం!
KASHMIR TERRORISM REPORT: జమ్ము కశ్మీర్లో ముష్కరులపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ఉగ్రవాదం వైపు మళ్లుతున్న యువతలో అధిక మంది తొలి ఏడాదిలోనే హతమవుతున్నట్లు తేలింది. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో భద్రతా దళాల చేతిలో 90 మంది ముష్కరులను మట్టుబెట్టినట్లు నివేదికలో అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'తేజస్'వైపే మలేసియా మొగ్గు... చైనా, రష్యా నుంచి పోటీ ఎదురైనా..!
తేజస్ యుద్ధవిమానాలను కొనుగోలు చేసేందుకు మలేసియా ఆసక్తి చూపుతోంది. తన వైమానిక దళంలో పాతబడిపోతున్న రష్యన్ తయారీ మిగ్-29 యుద్ధవిమానాల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేయడానికి కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించిన మలేసియా.. తేజస్వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమెరికా పౌరసత్వాల్లో మనదే హవా!.. ఎంత మందికి ఇచ్చారంటే?
US naturalised citizens: అమెరికాలో కొత్తగా పౌరసత్వం పొందినవారిలో భారతీయులు అధిక సంఖ్యలో ఉంటున్నారు. మెక్సికో తర్వాత భారత్‌కు చెందినవారికే పౌరసత్వాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఈ విషయం అమెరికా వెల్లడించిన గణాంకాల్లో స్పష్టమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెట్రోల్‌పై సుంకం తగ్గించినా.. ఖజానాకు నష్టం తక్కువే!.. కొత్త పన్నుతో భర్తీ!
windfall tax crude oil: పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకుంది. ఇందువల్ల ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల మేర ఆదాయం ప్రభుత్వానికి తగ్గుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే, ఇంధనంపై ఎగుమతి సుంకం, ముడిచమురుపై విండ్‌ఫాల్ పన్ను.. ఆ లోటును భర్తీ చేయనుందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సెంచరీ కొట్టిన సెంటర్ కోర్టు.. వింబుల్డన్‌కే ప్రత్యేక ఆకర్షణ
Wimbledon Court: టెన్నిస్ నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల్లో వింబుల్డన్ ఎంతో ప్రత్యేకం. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్‌లో ఉన్న సెంటర్ కోర్టుకు మరింత ప్రాముఖ్యం ఉంది. 1922, జులై 3న ప్రారంభమైన ఈ సెంటర్ కోర్టు ఆదివారం శతవసంతాలు పూర్తి చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ప్రభాస్‌లో అదే అత్యుత్తమ లక్షణం.. తనకు ప్రత్యేక స్థానం ఉంది'
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించింది శృతిహాసన్. ప్రభాస్‌లో ఉన్న ఆ లక్షణం చాలా అత్యుత్తమం అని.. ప్రపంచంలో అలాంటి వారికి ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పుకొచ్చింది. మరోవైపు ప్రభాస్‌తో సినిమాపై హీరో గోపించద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు