- Crop Insurance: పంటల బీమా.. అగమ్యగోచరం
Crop Insurance: ఉచిత పంటల బీమా అంతా అగమ్యగోచరంగా తయారైంది. ఈ-పంటలో నమోదు చేసినా బీమా రాలేదని కొందరు.. ఈ-కేవైసీ చేసినా సమాచారం గల్లంతైందని మరికొందరు రైతులు వాపోతున్నారు. ఈ-పంటలో నమోదై, ఈ-కేవైసీ చేయించుకోని వారందరికీ మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అర్ధరాత్రి కూల్చివేతలేంటి?' అయ్యన్న ఇంటి ప్రహరీ కూల్చివేతపై హైకోర్టు విస్మయం
తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి ప్రహరీ కూల్చివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇంటిజోలికి వెళ్లవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జగనన్న ఇంటి నిర్మాణానికి.. ఇచ్చేది గోరంత.. ఖర్చయ్యేది కొండంత..
జగనన్న కాలనీల్లో ఇల్లు కేటాయించారన్న సంతోషం కంటే.. ఎలా పూర్తిచేయాలన్న ఆందోళనే పేదలను ఎక్కువగా వేధిస్తోంది. ఇంటి నిర్మాణానికి లక్షా 80 వేలు ఇస్తున్నామని రాష్ట్రం ఘనంగా చెబుతున్నా.. అది పూర్తిగా కేంద్ర సాయమే. లక్షా 80 వేలతోనే ఇల్లు కట్టేయవచ్చని లెక్కలు కట్టినా.. అదికూడా 2020 డిసెంబర్ నాటి ధరల ప్రకారం వేసిన అంచనానే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Revenue Employees Association: బకాయిలు ఎప్పుడిస్తారు?: రెవెన్యూ ఉద్యోగుల సంఘం
Revenue Employees Association: ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్, సెలవు కాలపు చెల్లింపుల బకాయిలను విడుదల చేయలేదని.. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉద్యోగ సంఘాల చర్చల సందర్భంగా బకాయిలను చెల్లిస్తామని ఇచ్చిన హామి ఇప్పటికి నెరవేర్చలేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చింతన్ శిబిర్‌తో కాంగ్రెస్‌లో కదలిక.. సవాళ్లు ఉన్నా మార్పులకు సై
చింతన్ శిబిర్ నిర్వహించిన నెల రోజుల తర్వాత ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంపై కాంగ్రెస్ దృష్టిసారించింది. పార్టీ వాణిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నాలపై కసరత్తు చేస్తోంది. ఇటీవలే కీలక పదవులకు కీలక నేతలను నియమించటం అందులో భాగమే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ?
- బెర్లిన్ గోడ స్మారకాన్ని సందర్శించిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
cji nv ramana berlin tour: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ జర్మనీ పర్యటనలో భాగంగా బెర్లిన్ గోడ స్మారకాన్ని సందర్శించారు. రెండో ప్రపంచ యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత నిర్మించిన బెర్లిన్ గోడ అంతర్జాతీయ చిహ్నంగా మిగిలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారంగానే గురుద్వారాపై దాడి
మహమ్మద్ ప్రవక్తపై భారత్‌లో భాజపా ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలపై పలు దేశాలు ఇంకా ఆగ్రహాన్ని వెల్లగక్కుతూనే ఉన్నాయి. శనివారం రోజున అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో గురుద్వారాపై జరిగిన దాడి కూడా.. ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగానే జరిగింది. ఈ విషయాన్ని ఇస్లామిక్‌స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అలా జరిగితేనే అదుపులోకి ద్రవ్యోల్బణం'
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపటం సహా.. సాధారణ వర్షపాతానికి తోడు వ్యవసాయ దిగుబడులు బాగుండాలని అభిప్రాయపడ్డారు పలువురు ఆర్థిక వేత్తలు. నగదు లభ్యత మరీ సులభం కాకుండా చూడటం వల్ల ఆహార, ఇంధన ధరల్ని అదుపులోకి తీసుకురావచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 8 నెలల్లో ఆరుగురు కెప్టెన్లు.. ద్రవిడ్ ఏం అన్నాడంటే?
Teamindia Six captains in eight months: గత 8 నెలల్లో వివిధ ఫార్మాట్లలో టీమ్ఇండియాకు ఆరుగురు కెప్టెన్లుగా వ్యవహరించడం.. ప్రణాళికతో జరిగింది కాదని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. అయితే దీనివల్ల మరింత మంది నాయకులను తయారు చేసే అవకాశం లభించిందని అన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాలయ్య సినిమాలో రాజశేఖర్.. విలన్‌గా కాదు ఆ పాత్రలో!
Balakrishna Anilravipudi movie: బాలయ్య-అనిల్ రావిపూడి చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్.. హాస్యం పండించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. సినిమాలో బాలయ్య స్నేహితుడిగా కనిపించి ఫుల్ కామెడీ చేయబోతున్నారట. మరో విశేషమేమిటంటే.. ఒరిజినల్ వాయిస్‌లోనే ఆయన మాట్లాడనున్నారని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు