ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11AM - ఏపీ న్యూస్

.

TOP NEWS
ప్రధాన వార్తలు

By

Published : Jun 15, 2022, 10:59 AM IST

  • పంట విరామం ప్రకటించిన కౌలు రైతులు.. గోదావరి జిల్లాలో 80 శాతం సాగుదారులు వీరే
    Crop Holiday in Konaseema: కోనసీమలో కౌలు రైతులు పంట విరామం ప్రకటించారు. తొలి పంట వేయలేమని ఇప్పటికే భూ యజమానులకు చెప్పేశారు. ఇంటిల్లిపాది కూలి చేసి సంపాదించుకున్న డబ్బులు కూడా కౌలు పేరిట మాగాణుల్లో పెట్టి నిండా మునిగిపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • పాఠాలు చెప్పేవారు లేకనే.. పదో తరగతి పరీక్షల్లో 50%లోపే ఉత్తీర్ణత
    Lack of teachers: ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో.. ఉపాధ్యాయుల కొరత కారణంగా పదోతరగతి ఉత్తీర్ణత శాతం తీవ్రస్థాయిలో తగ్గిపోయింది. రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత 67.26% కాగా.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో 50 శాతంలోపే ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Registration: 3 నెలల్లో.. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ తప్పనిసరి
    Registration: రాష్ట్రంలో వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) అమర్చుకోవడం తప్పనిసరి చేయడంపై.. రవాణాశాఖ దృష్టి సారించింది. మూడు నెలల్లో వీటిని బిగించుకోకపోతే, ఆ తర్వాత రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • High Court: ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణపై వ్యాజ్యం.. జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరణ
    High court: ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించేలా.. ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రతి వ్యవహారం పిల్ కిందకు రాదని స్పష్టం చేసిన హైకోర్టు.. ఈ వ్యాజ్యాన్ని కొట్టేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు
    India Covid cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే 8,822 మందికి వైరస్​ సోకింది. మరో 15 మంది చనిపోయారు. మంగళవారం ఒక్కరోజే 5,718 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • బ్యాంక్​ మేనేజర్​ హత్యకు రివెంజ్​.. ఇద్దరు ముష్కరులు హతం
    JammuKashmir Encounter: కశ్మీర్​లోని షోపియాన్​ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య బుధవారం ఎన్​కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. వారిలో ఒకరు కుల్గామ్​ జిల్లా బ్యాంకు మేనేజర్​ను కాల్చిచంపిన కేసులో నిందితుడని తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • పోలీసులు, సాయుధుల మధ్య కాల్పులు.. పది మంది మృతి
    Mexico Firing: మెక్సికోలో పోలీసులు, సైనికులు, సాయుధుల మధ్య జరిగిన కాల్పుల్లో పది మంది సాయుధులు మృతిచెందగా ముగ్గురు డిటెక్టివ్​లు సహా నలుగురు గాయపడ్డారు. ఘటనాస్థలిలో 20 రైఫిళ్లు, బుల్లెట్​ ప్రూఫ్ చొక్కాలు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ప్రాసిక్యూటర్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • వినియోగదారులకు ఎస్​బీఐ గుడ్​న్యూస్​.. ఎఫ్​డీ వడ్డీ రేట్లు పెంపు
    SBI Rates: వడ్డీ రేట్లపై ఇటీవల ఆర్​బీఐ ప్రకటన నేపథ్యంలో.. వినియోగదారులకు ఎస్​బీఐ శుభవార్త చెప్పింది. ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. సీనియర్​ సిటిజన్లకు దీనిపై 0.5 శాతం అదనంగా వడ్డీ లభిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మళ్లీ మెరిసిన నీరజ్​ చోప్రా.. ఈసారి జాతీయ రికార్డు కైవసం
    Neeraj chopra: టోక్యో ఒలింపిక్స్​ గోల్డ్​ మెడలిస్ట్​, జావెలిన్​ త్రోయర్​ నీరజ్​ చోప్రా.. మళ్లీ మెరిశాడు. ఫిన్లాండ్​లో జరిగిన పావో నుర్మీ గేమ్స్​లో 89.30 మీ. బల్లెం విసిరి జాతీయ రికార్డు సృష్టించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • హాలీవుడ్‌ని తలపించేలా రణ్​బీర్​ 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్​
    Ranbir Bramhastram trailer: అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్రహ్మాస్త్రం ట్రైలర్​ విడుదలైంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సినిమాపై భారీగా అంచనాలను పెంచుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details