- Monsoon: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు... వానలే వానలు
Monsoon: నైరుతి రుతుపవనాల్లో జాప్యమేమీ లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే కేరళలోకి ప్రవేశించాయని... రెండు రోజుల్లో రాష్ట్రంతో పాటు పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఆంధ్రలో ఒకట్రెండు చోట్ల వడగాడ్పులు వీయొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సీఆర్‌డీఏ చట్టం రక్షణ ఉండగా ఈ కేసు ఎలా చెల్లుతుంది?.. రాజధాని భూములపై హైకోర్టు
Narayana bail petition: రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పలువురిపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Viveka murder case: వివేకా హత్య కేసులో అన్నీ అనుమానస్పద మరణాలే..!
Viveka murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి.. గురువారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ హత్యకేసులో ఇది రెండో మరణం. హత్య కేసులో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న ఏపీ జెన్‌కో
తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ జెన్‌కో ఉపసంహరించుకుంది. తమకు చెల్లించాల్సిన రూ.6,283 కోట్ల బకాయిలను తిరిగి రాబట్టుకునేందుకు విభజన సమస్యల పరిష్కార కమిటీని ఆశ్రయిస్తామని ఏపీ జెన్‌కో హైకోర్టుకు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రపతి అభ్యర్థుల రేసులో పలువురు గవర్నర్లు.. తమిళిసై కూడా!
Presidential Elections India: రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. వచ్చే నెల 18న ఎన్నిక జరగనుండటంతో ఈ అత్యున్నత పదవికి పోటీపడే అభ్యర్థులు ఎవరనే చర్చ జోరందుకుంది. ఇప్పటివరకు అధికార, ప్రతిపక్ష పార్టీలేవీ తమ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఎవరిని తెరపైకి తీసుకొస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యుక్త వయసు రాకముందే రజస్వల.. లాక్‌డౌన్‌లో 3.6 రెట్లు అధికం!
బాలికల ఆరోగ్యంపైనా లాక్‌డౌన్ ప్రభావం చూపినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. యుక్త వయసు రాకముందే రజస్వల (Precocious Puberty) అయిన కేసుల సంఖ్య లాక్‌డౌన్ సమయంలో 3.6 రెట్లు పెరిగినట్లు పుణె పరిశోధకులు గుర్తించారు. అయితే, ఇందుకు కచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అణుబాంబు తయారీలో ఇరాన్!.. ఏ దేశంపై ప్రతీకారం?
IAEA Iran News: ఇరాన్‌పై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) కీలక వ్యాఖ్యలు చేసింది. అణ్వాయుధ తయారీకి ఉపకరించే యురేనియంను ఉత్పత్తి చేసే దశకు చేరుకుంటున్న ఇరాన్ తన కార్యకలాపాలు ఐఏఈఏ కంటపడకుండా జాగ్రత్త పడుతోందని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫయేల్ మేరియానో గ్రాసి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఓపిక ఉంటేనే షేర్లు కొనండి: వారెన్ బఫెట్
ఎక్కువకాలం వేచి చూడలేని వారు షేర్లు కొనద్దని ఆయన సూచిస్తున్నారు వారెన్ బఫెట్. ఒక స్థలం కొనడానికి మనం ఎలా సన్నద్ధులం అవుతామో, షేర్లు కొనుగోలు చేయడానికీ అదేవిధంగా సిద్ధం కావాలని వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇండోనేసియా మాస్టర్స్ క్వార్టర్స్‌లో సింధు, లక్ష్యసేన్
PV Sindhu: ఇండోనేసియా బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది పి.వి.సింధు. ప్రిక్వార్టర్స్‌లో 23-21, 20-22, 21-11తో అన్‌సీడెడ్ జార్జియా టున్‌జుంగ్ (ఇండోనేసియా)పై కష్టపడి గెలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రంగంలోకి 'భోళాశంకర్'.. 'బ్రహ్మాస్త్ర' బిగ్‌బీ లుక్స్ అదుర్స్
సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్', రణ్‌బీర్‌కపూర్, అలియా 'బ్రహ్మాస్త్ర', హీరో శివ కార్తికేయన్ చిత్ర సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు