- Suspicious Death: వివేకా హత్యకేసులో సాక్షి గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతి
Suspicious Death: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన మరణించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- TTD: సామాన్యులకూ నిరీక్షణ లేకుండా శ్రీవారి దర్శనం: తితిదే ఈవో ధర్మారెడ్డి
TTD: తిరుమలలో గంటల కొద్దీ నిరీక్షణ లేకుండా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు.. తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. వీరికి సర్వదర్శనం గంటన్నర వ్యవధిలోనే చేయించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోనసీమలో పంట విరామంపై కదిలిన యంత్రాంగం.. రైతుల ఖాతాల్లోకి రూ.120కోట్లు జమ
రైతులు పంటవిరామం ప్రకటించడంతో అధికార యంత్రాంగం మేల్కొంది. ఖరీఫ్‌లో పంట వేయబోమంటూ కొందరు రైతులు తీర్మానాలు చేశారు.2011లో మాదిరిగా పంటవిరామాన్ని ఉద్ధృతం చేసే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి డబ్బుల విడుదలకు హామీ ఇచ్చి అమరావతి స్థాయిలో ఉన్నతాధికారులతో చర్చించి రూ.120 కోట్ల విడుదలకు కృషిచేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మరో 7,240 మందికి వైరస్
India Covid cases: భారత్‌లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజే 7,240 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఎనిమిది మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బావిని శుభ్రం చేస్తూ ఐదుగురు మృతి.. ముగ్గురు అన్నదమ్ములే!
Toxic Gas Well: బావిలోని విషవాయువుల కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా కుదాన్ గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. మృతుల్లో ముగ్గురు అన్నదమ్ములుగా గుర్తించారు అధికారులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చైనాపై మస్క్ కీలక వ్యాఖ్యలు.. త్వరలోనే పతనమవుతుందంటూ..
Elon Musk China population: చైనా జనాభా సంక్షోభంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు సంతానం విధానం ప్రవేశపెట్టినప్పటికీ గతేడాది జననాల రేటు అత్యంత కనిష్ఠంగా నమోదైందన్న ఆయన.. ప్రతి తరంలో 40 శాతం మందిని చైనా కోల్పోతుందని మస్క్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి.. పదుల సంఖ్యలో..
South Korea office building Fire: దక్షిణ కొరియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కార్యాలయ భవనంలో చెలరేగిన మంటల్లో ఏడుగురు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. నేటి లెక్కలు ఇలా
Gold Price Today: బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,790గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,853గా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నా శక్తిమేరకు కృషి చేస్తా.. అదే నా లక్ష్యం: ఉమ్రాన్ మాలిక్
IND VS SA Umran malik: తాను టీమ్ఇండియాకు ఎంపిక అవుతానని హైదరాబాద్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ ముందుగానే గ్రహించినట్లు చెప్పాడు పేస్ బౌలింగ్ సంచలనం ఉమ్రాన్ మాలిక్. ఇప్పుడు టీమ్ ఇండియా కోసం తన శక్తిమేరకు కృషి చేయడమే లక్ష్యమని తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రామ్‌చరణ్ అలా చేసేవారు.. నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్న యువ హీరో
తాను నటించిన 'చోర్‌బజార్' త్వరలోనే రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు పూరి జగన్నాథ్ తనయుడు, యువ హీరో ఆకాశ్. మెగాహీరో రామ్‌చరణ్‌తో తనకు ఉన్న బంధాన్ని తెలిపాడు! దానికి సంబంధించిన ప్రోమో చూసేయండి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు