ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @9PM - AP TOP NEWS

.

ప్రధాన వార్తలు @9PM
ప్రధాన వార్తలు @9PM

By

Published : Mar 9, 2022, 8:59 PM IST

  • ఉపాధ్యాయుల సేవలను ఆ కార్యక్రమాల్లో వినియోగించుకోవద్దు: సీఎం జగన్
    మార్చి 15 నుంచి నాడు-నేడు రెండో విడత పనులు మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడనున్న 26 జిల్లాల్లోనూ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలానికి ఒక కో ఎడ్యుకేషన్‌ జూనియర్‌ కళాశాల, ఒక మహిళా జూనియర్‌ కళాశాల ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీచర్ల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ వాడుకోకూడదని సీఎం స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ముందస్తు ఎన్నికలకు వైకాపా.. తెదేపాకు 160 సీట్లు: అచ్చెన్న
    వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. అది మరింత పెరిగితే నష్టమని భావించి వైకాపా ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అదే జరిగితే.. తెదేపాకు 160 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • Janasena: జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు పోలీసుల అనుమతి
    జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు పోలీసులు అనుమతినిచ్చారు. ఈ నెల 14న తాడేపల్లి మండలం ఇప్పటంలో జనసేన సభ నిర్వహించనుంది. అంతకు ముందు ఆవిర్భావ సభకు పోలీసులు అనుమతి నిరాకరించినట్టు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సభకు ప్రభుత్వం ఆటంకాలు కల్పించడం సరికాదని మండిపడ్డారు. మనోహర్‌ మీడియా సమావేశం తర్వాత కాసేపటికే సభకు అనుమతించినట్టు పోలీసులు తెలిపారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • కేసీఆర్ కీలక ప్రకటన.... తెలంగాణలో 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
    తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపికబురు అందించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • మినీ సార్వత్రికం కౌంటింగ్​కు సర్వం సిద్ధం.. విజేతలు ఎవరో?
    సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం... కేంద్ర ఎన్నికల సంఘం విస్త్రత ఏర్పాట్లు చేసింది. దేశ ప్రజంలదరి దృష్టి..అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌పైనే కేంద్రీకృతమైంది. భాజపా అధికారం నిలబెట్టుకుంటుందని... మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. పంజాబ్‌లో అధికార మార్పిడి ఖాయమని, ఆమ్‌ఆద్మీ జయభేరి మోగిస్తుందని పేర్కొన్నాయి. ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లో పోటాపోటీ ఉంటుందని తెలిపాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • పిల్లల కోసం మరో కరోనా టీకా- ఓకే చెప్పిన డీసీజీఐ
    పిల్లలకు సంబంధించి మరో కరోనా టీకా అత్యవసర వినియోగానికి భారత్ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతినిచ్చింది. కొన్ని షరతులతో కొవోవ్యాక్స్ వినియోగానికి పచ్చజెండా ఊపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • న్యూక్లియర్ ప్లాంట్​కు కరెంట్ కట్.. ఉక్రెయిన్​లో డేంజర్​ బెల్స్​!
    రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. తూర్పు ఉక్రెయిన్​లో రష్యా చేసిన దాడుల్లో.. 10 మంది పౌరులు మరణించారు. కాగా, చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్​కు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. గ్రిడ్ ధ్వంసం కావడం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్లాంట్​కు అనుసంధానమైన జనరేటర్లలో 48 గంటలకు సరిపడా డీజిల్ మాత్రమే ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • స్టాక్ మార్కెట్లలో బుల్​రన్.. సెన్సెక్స్ 1200 ప్లస్
    దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా వృద్ధి చెందగా.. నిఫ్టీ 332 పాయింట్లు ఎగబాకింది.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఒక్క ఫైట్ కూడా లేని 'రాధేశ్యామ్'.. అందరినీ అలరిస్తుందా?
    పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్ విలన్​లను చితక్కొడుతుంటే చూస్తూ విజిల్స్ వేయకుండా ఉంటామా చెప్పండి. 'యోగి' సినిమాలో విలన్​ను ఒక్క గుద్దుకే చంపిన మన డార్లింగ్​.. కెరీర్​లోనే తొలిసారిగా ఒక్కఫైట్​ కూడా లేకుండా చేసిన సినిమానే 'రాధేశ్యామ్​'. అవుట్ అండ్ అవుట్ ప్యూర్ లవ్​స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • Test Rankings 2022: టెస్ట్​ ర్యాంకింగ్స్​లో అతడే నెం. 1
    ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. భారత ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా ఐసీసీ టెస్టు ఆల్​రౌండర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details