- విజయనగరంలో భారీ చోరీ.. 5 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
విజయనగరంలో భారీ చోరీ జరిగింది. నగరంలోని గంటస్తంభం సమీపంలో ఉన్న రవి జ్యూయలర్స్లో 5 కిలోల బంగారం అభరణాలను దొంగలు దోచుకెళ్లారు. దుండగలు..పై కప్పు నుంచి దుకాణంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- తిరుమల పవిత్రత దెబ్బతీసేలా తితిదే బోర్డు నిర్ణయాలు: పయ్యావుల
తిరుమల పవిత్రత దెబ్బతీసేలా తితిదే బోర్డు నిర్ణయాలు తీసుకుంటోందని తెదేపా పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలను వ్యాపార కేంద్రం చేస్తున్నారన్నారు. టికెట్ లేకుంటే తిరుపతి నుంచి తిరుమలకూ పంపటం లేదని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులను కాపాడుకోవాల్సిన బాధ్యత దిల్లీ పెద్దలదే'
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులను కాపాడేందుకు జగన్ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల్ని సైతం నాశనం చేస్తుందని తెదేపా నేత బోండా ఉమా ఆరోపించారు. వివేకా కేసు దర్యాప్తు చేస్తున్న అధికారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దిల్లీ పెద్దలదేనని వ్యాఖ్యానించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అమరావతినే కాదు రాష్ట్రాన్నే శ్మశానంగా మార్చారు -తెదేపా
తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో.. పోలవరం ప్రాజెక్ట్ స్థితిగతులు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి చర్చించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- యూపీలో నాలుగో దశ ఎన్నికలు ప్రశాంతం- 57.5% పోలింగ్!
ఉత్తర్ ప్రదేశ్లో నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 57.45శాతం ఓటింగ్ నమోదైంది. ఈ దఫా మొత్తం 624 మంది బరిలో నిలవగా.. మార్చి 10న వీరి భవితవ్యం తేలనుంది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కచోడీ కోసం ట్రైన్ ఆపిన డ్రైవర్.. తర్వాత ఏమైందంటే?