ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9AM - ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

.

ప్రధాన వార్తలు @9AM
ప్రధాన వార్తలు @9AM

By

Published : Jan 27, 2022, 9:00 AM IST

రూ.5,375 కోట్లు సర్దుబాటే..!

నూతన పీఅర్సీ అమలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం.. తొలి తొమ్మిది నెలల పాటు ఇచ్చిన మధ్యంతర భృతి మొత్తాన్ని కూడా సర్దుబాటు చేస్తోంది. 2019 జులై నుంచి 2020 మార్చి వరకు ఐఆర్‌ రూపంలో ఇచ్చిన మొత్తం సుమారు రూ.5,375 కోట్ల వరకు ఉంటుందని అంచనా.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Slight change in district names : పలు జిల్లాల పేర్లలో స్వల్ప మార్పు

కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం... ప్రతి జిల్లాకు వేర్వేరుగా ముసాయిదా ప్రకటనలు జారీ చేసింది.ఈ ప్రతిపాదనలపై స్థానికులకు ఏమైనా అభ్యంతరాలున్నా, సూచనలు చేయాలనుకున్నా 30 రోజుల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్‌లకు తెలియజేయాలని ప్రభుత్వం పేర్కొంది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • జిల్లాల విభజనపై అసంతృప్తి... సుదీర్ఘకాల డిమాండ్లను పట్టించుకోలేదని వాదన

కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త ఆకాంక్షలు, డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. కొత్త జిల్లాల కోసం ఎప్పటి నుంచో ఉన్న కొన్ని డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదన్న అసంతృప్తి కొందరి నుంచి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఉద్యమానికి సిద్ధమవుతుండగా, కొందరు వివిధ మార్గాల్లో నిరసన తెలియజేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • rape accused arrest: బాలికతో వ్యభిచారం కేసులో మరో అయిదుగురి అరెస్టు

బాలికతో వ్యభిచారం చేయించిన కేసులో మరో అయిదుగురిని గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో వైకాపాకు చెందిన ఓ మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు కన్నా భూశంకరరావు ఉన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • విద్యార్థినిపై ఇద్దరు సహచర బాలురు అత్యాచారం!

బాలికను ఆమె చదువుతున్న పాఠశాలలోని ఇద్దరు బాలురు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. ఈ ఘటన రాజస్థాన్​లోని డూంగర్​పుర్​లో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఎన్నికల బరిలో యువకిశోరాలు.. గెలుపుతో బోణీ కొడతారా?

పంజాబ్‌లో పలువురు యువకిశోరాలకు కాంగ్రెస్‌ టికెట్లు ఇచ్చింది. వీరంతా ఎన్నికల్లో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రముఖ నటుడు సోనూసూద్ సోదరి సహా పలువురు యువనేతలు బరిలోకి దిగుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రసవత్తరంగా 'యూపీ' రాజకీయాలు.. కూటమి లెక్కల్లో కొత్త చిక్కులు!

పశ్చిమ ఉత్తర్​ప్రదేశ్​లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జాట్‌లకు భాజపాలో లభించిన ప్రాధాన్యం ఎస్పీలో దక్కలేదని ఆర్​ఎల్​డీ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో ఎస్​పీకి మద్దతు ఇవ్వడంపై నిరాసక్తి చూపుతున్నాయి. మరోవైపు, ఈ పరిస్థితులను తనకు అనుకూలించేలా మార్చుకునేందుకు రంగంలోకి దిగారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఏదేమైనా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదు: బ్రిటన్​ ప్రధాని

తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. 'పార్టీ గేట్' కుంభకోణం ఆ దేశంలో వివాదాస్పదమైన నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేయాలని బోరిస్​పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా స్పష్టతనిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ధోనీలాంటోడు ఉండాల్సిందే.. ఆ సత్తా ఇద్దరికే ఉంది'

ప్రతిజట్టులోనూ ధోనీ లాంటి సహజ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండాలని అభిప్రాయపడ్డాడు ఆసీస్​ మాజీ కెప్టెన్​ గ్రెగ్​ ఛాపెల్​. టెస్టుల్లో 1000 వికెట్లు తీయగల సత్తా టీమ్‌ఇండియా ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌, ఆసీస్‌కు చెందిన నాథన్‌ లియాన్​కు మాత్రమే ఉందని పేర్కొన్నాడు షేన్​ వార్న్.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • స్టార్ హీరోయిన్​తో నెట్​ఫ్లిక్స్ రూ.400 కోట్ల డీల్!

ప్రముఖ కథానాయిక, నిర్మాత అనుష్క శర్మతో నెట్​ఫ్లిక్స్​ సంస్థ కళ్లు చెదిరే డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సినిమాలు, వెబ్ సిరీస్​లు, డాక్యుమెంటరీలు సంయుక్తంగా నిర్మించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details