- CM Jagan: మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేరబోతుంది: సీఎం జగన్
జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ పథకంతో మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేరనుందని సీఎం జగన్ అన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి పథకానికి సంబంధించిన వెబ్‌సైట్ సీఎం ప్రారంభించారు. అత్యంత పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- RGV TWEET: సినిమా టికెట్ ధరలపై మరోసారి ట్విటర్‌లో స్పందించిన ఆర్జీవీ
రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ టికెట్ల ధర రూ.2,200 వరకు అనుమతించారని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- CHILDRENS DEAD: ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన ఇసుక గుంతలు
సంక్రాంతి సెలవులు సరదాగా గడుపుదామనుకున్న ఆ స్నేహితులను మృత్యువు ఇసుక గుంతల రూపంలో కబళించింది. ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారులను మున్నేరు మింగేసింది. ఇంటి నుంచి ఆడూతూ పాడుతూ వెళ్లిన బిడ్డలు ఎక్కడో ఓ చోట క్షేమంగా ఉండి ఉంటారని ఎదురుచూసిన తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలింది. ఐదుగురు చిన్నారుల మృతితో కృష్ణా జిల్లా ఏటూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- గాయని లతా మంగేష్కర్‌కు కరోనా.. ఐసీయూలో చికిత్స
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తృతంగా వ్యాపిస్తోంది. దీంతో దేశంలో రోజులు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కూడా కరోనా బారినపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Corona test guidelines: 'లక్షణాలు లేకుంటే కరోనా పరీక్ష అవసరం లేదు'
లక్షణాలు లేని వారు కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ తెలిపింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. దగ్గు, జ్వరం, గొంతులో సమస్య, రుచి, వాసన కోల్పోయినవారు మాత్రం తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మతిస్థిమితం సరిగాలేని బాలికపై గ్యాంగ్ రేప్
మానసిక స్థితి సరిగాలేని బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. మరో కేసులో పాఠశాలకు వెళ్తున్న బాలికను అపహరించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ వ్యక్తి. ఈ సంఘటనలు కర్ణాటకలో వెలుగు చూశాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'పాఠశాల విద్యార్థులను ప్రలోభ పెట్టి అడవిబాట పట్టిస్తున్న నక్సల్స్'
నక్సలైట్లు పాఠశాల విద్యార్థులను ప్రలోభ పెట్టి అడవి బాట పట్టిస్తున్నారని బస్తర్ ఐజీ తెలిపారు. ఇప్పటికే చాలా మంది పిల్లలు నక్సలైట్ల సంస్థల్లో చేరారని పేర్కొన్నారు. వారందరినీ తిరిగి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- యురోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ డేవిడ్ సస్సోలీ కన్నుమూత
యురోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ డేవిడ్ సస్సోలీ మంగళవారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన ప్రతినిధి ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మూడో టెస్టులో కోహ్లీ సెంచరీ ఖాయం: భజ్జీ
దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడో టెస్టులో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. అలాగే సీనియర్ బ్యాటర్లు పుజారా, రహానె కూడా రాణిస్తారని తెలిపాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'మోహన్ బాబుతో అందుకే సినిమా చేయలేదు'
'అంకుశం' సినిమాలో డైరెక్టర్ చెబితేనే రామిరెడ్డిని కొట్టినట్లు చెప్పారు సీనియర్ హీరో రాజశేఖర్. 'ఆలీతో సరదాగా' షోకు వచ్చిన సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. మోహన్‌బాబుతో కలిసి ఎందుకు సినిమా చేయలేదన్న ప్రశ్నపై క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి