ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Top news: ప్రధాన వార్తలు @ 1PM - ఏపీ ముఖ్యవార్తలు

.

Top news
ప్రధాన వార్తలు

By

Published : Jan 4, 2022, 1:00 PM IST

  • CM Jagan meets Gadkari: కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం జగన్‌ భేటీ... పలు కీలక అంశాలపై చర్చ

CM Jagan meets Gadkari: దిల్లీలో రెండో రోజు ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన కొనసాగుతోంది. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. విభజన హామీలు, రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్రమంత్రితో చర్చించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • పెద్దజాలరిపేట, చిన్నజాలరిపేట మత్స్యకారుల మధ్య వివాదం

విశాఖలో పెద్దజాలరిపేట, చిన్నజాలరిపేట మత్స్యకారుల మధ్య వివాదం చెలరేగింది. రింగు వలల విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో... సముద్రంలో ఉన్న పడవకు నిప్పుపెట్టిందో వర్గం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • CENTRAL TEAM:గుంటూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన...జీవీఎల్​తో భేటీ

CENTRAL TEAM: గుంటూరు జిల్లాలో తామర పురుగుతో దెబ్బతిన్న మిర్చి పంటను పరిశీలించడానికి 9 మంది అధికారుల కేంద్ర బృందం జిల్లాకు చేరుకుంది. సుగంధ ద్రవ్యాల బోర్డు కార్యాలయంలో ఎంపీ జీవీఎల్​తో వారు భేటీ అయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • RGV TWITTER: ఏపీ ప్రభుత్వంపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్ దాడి

సినిమా టికెట్ల ధరల అంశానికి సంబంధించి దర్శకుడు రాంగోపాల్‌ వర్మ... మంత్రి పేర్ని నానికి ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నలు సంధించారు. సినిమా సహా ఏదైనా ఉత్పత్తికి ధర నిర్ణయంలో ప్రభుత్వ పాత్ర ఎంత అని వర్మ ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 5వ తేదీన నీట్​లో 'ఈడబ్ల్యూఎస్' కోటాపై సుప్రీం అత్యవసర విచారణ

NEET PG Exam EWS Quota: నీట్​ పీజీ పరీక్షలో ఈడబ్ల్యూఎస్ కోటా వ్యవహారంపై దాఖలైన పిటిషన్​ను విచారించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మానసం పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • పిల్లలకు కొవాగ్జిన్​కు బదులు కొవిషీల్డ్.. తర్వాత ఏమైందంటే?

Nalanda Covid Vaccination Mistake: ఇద్దరు టీనేజర్లకు పొరపాటున కొవాగ్జిన్​కు బదులు కొవిషీల్డ్ టీకా వేశారు వైద్య సిబ్బంది. అయితే వ్యాక్సిన్​ సర్టిఫికెట్​లో మాత్రం ఇద్దరికీ కొవాగ్జిన్ ఇచ్చినట్లుగా ఉంది. ఈ ఘటన బిహార్​లోని నలంద జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కరోనా ప్రళయం.. అమెరికాలో ఒక్కరోజే 10 లక్షల కేసులు

Corona cases in America: అగ్రరాజ్యంలో కరోనా మహమ్మారి రాకెట్​ వేగంతో దూసుకెళుతోంది. సోమవారం ఒక్కరోజే 10లక్షలు కేసులు నమోదయ్యాయి. వైరస్​ బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో లక్షకుపైగా చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • SBI-IMPS Limit: ఐఎంపీఎస్‌ లిమిట్‌ పెంచిన ఎస్‌బీఐ.. ఛార్జీలు ఇలా..

SBI IMPS limit: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ).. ఇమిడియెట్‌ పేమెంట్‌ సర్వీస్​(ఐఎంపీఎస్‌) లావాదేవీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్రతి లావాదేవీకి రూ.20పైగా జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • వారిద్దరికీ ఇదే చివరి టెస్టు.. గావస్కర్ కీలక వ్యాఖ్యలు

Gavaskar comments on Rahane Pujara: జోహన్నెస్​బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్లు పుజారా, రహానే మరోసారి విఫలమయ్యారు. ఒలీవర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 24వ ఓవర్‌లో పుజారా (3), రహానే (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. ఈ క్రమంలోనే వీరి ఫామ్​పై స్పందించాడు మాజీ బ్యాటర్ సునీల్ గావస్కర్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'ఆంటీతో డేటింగ్​' అంటూ ట్రోల్స్​.. అర్జున్​కపూర్​ స్ట్రాంగ్​ కౌంటర్​

Arjun kapoor Malaika arora releationship: తనపై ట్రోల్స్ చేసిన వారికి గట్టి సమాధానమిచ్చారు బాలీవుడ్​ హీరో అర్జున్​ కపూర్​. వయసును చూసి ప్రేమించడం మూర్ఖత్వం అని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details