ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM

.

ప్రధాన వార్తలు @ 3 pm
ప్రధాన వార్తలు @ 3 pm

By

Published : Oct 22, 2021, 3:00 PM IST

  • PATTABHI BAIL: హైకోర్టులో పట్టాభి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు.. రేపు విచారణ
    సీఎం జగన్‌ను పరుష పదజాలంతో దూషించాడన్న కారణంగా అరెస్టయిన తెదేపా నేత పట్టాభిరామ్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై ధర్మాసనం రేపు విచారించనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • పన్ను ఎగవేతలు తగ్గించడంపై ఏపీ దృష్టి
    జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశాన్ని వర్చువల్​లో నిర్వహించారు. ఇందులో కచ్చితమైన డేటా, వ్యాపార లావాదేవీల సమగ్ర విశ్లేషణ, నకిలీ ఇన్వాయిస్‌ల తగ్గింపు, పన్ను ఎగవేతను తగ్గించడం, నియంత్రణ అధికారులు-పన్ను వంటి అంశాలపై చర్చించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Paritala Sunitha: చంద్రబాబు గంట కళ్లు మూసుకుంటే చాలు: సునీత
    ఇన్నాళ్లు తామంతా చాలా ఓపిగ్గా ఉన్నామని.. రాష్ట్రంలో జరుగుతున్న దాడులను చూస్తూ ఇక ఓపికతో ఉండలేమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. గతంలో తాము పోలీస్ విభాగాన్ని వాడుకుని ఉంటే.. వైకాపా గుండాలు మిగిలి ఉండేవాళ్లు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా తిరిగి అధికారంలోకి వచ్చాక.. చంద్రబాబు గంట పాటు కళ్లు మూసుకుంటే చాలని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Murder: కళ్యాణదుర్గంలో దారుణం.. 2 నెలల పాపను చంపిన తండ్రి
    భార్య మీద ఉన్న అనుమానంతో ఓ కసాయి తండ్రి రెండు నెలల చిన్నారిని కడతేర్చాడు. ఈ అమానుష ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో చోటుచేసుకుంది. చిన్నారి నోటికి ప్లాస్టర్‌ అతికించి గోనె సంచిలో పెట్టి చెరువులో పడేశాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • భవనంలో అగ్నిప్రమాదం.. 19వ అంతస్తు నుంచి పడి..
    మహారాష్ట్ర ముంబయిలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం(Mumbai fire news) జరిగింది. లాల్‌బాగ్‌ ప్రాంతంలోని అవిగ్యాన్‌ పార్క్‌ సొసైటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 19వ అంతస్తులో మంటలు చెలరేగాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'డెంగీ' విజృంభణ- మేక పాలకు విపరీత డిమాండ్​!
    డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్​లో మేకపాలకు డిమాండ్​ పెరిగింది. వ్యాపారులు లీటర్​ పాలు రూ.400కు విక్రయిస్తున్నారు. మేక పాలకు, డెంగీకి ఏంటి పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • రెండు డోసులు తీసుకున్నారా..? అయితే ఈ 'ఫుడ్'​ ఆఫర్​ మీకే!
    భారత్​ టీకా పంపిణీలో 100 కోట్ల మార్కును (100 Crore Vaccine) చేరుకున్నందుకు గానూ మోహిత్​ అనే ఓ చిరుతిళ్ల వ్యాపారి స్థానికులకు బంపర్​ ఆఫర్​ ఇచ్చారు. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్​ పూర్తయిన వారు తన షాప్​కు వస్తే గుజరాత్​లోని సంప్రదాయ వంటకమైన 'లోచో'ను ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • సెల్​ ఫోన్​​ మింగేసిన ఘనుడు.. 6 నెలల తర్వాత!
    సాధారణంగా చిన్నపిల్లలు తెలియకుండా.. చిన్న చిన్న వస్తువులను మింగుతుంటారు. కానీ ఇక్కడ అన్నీ తెలిసిన ఒక పెద్ద మనిషి.. ఏకంగా సెల్​ఫోన్​నే (Man swallows phone) మింగేశాడు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ipl 2021: ఐపీఎల్ కొత్త జట్లు ఆ నగరాల నుంచే..!
    ఐపీఎల్​లో కొత్త జట్లు (ipl new teams) అహ్మదాబాద్​, లక్నో నగరాల నుంచి రానున్నట్లు సమాచారం. అహ్మదాబాద్​ నుంచి అదానీ గ్రూప్స్​.. మాంచెస్టర్ యూనైటెడ్​ ప్రీమియర్ లీగ్ లక్నో తరపున వేలంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'మా' ఎన్నికల్లో వైకాపా జోక్యం: ప్రకాశ్​రాజ్
    'మా' ఎన్నికల్లో వైస్సార్​సీపీ జోక్యం ఉందని అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాశ్​రాజ్ అన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను విడుదల చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details