ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Top news: ప్రధాన వార్తలు @ 11AM - 11am ప్రధాన వార్తలు

..

ప్రధాన వార్తలు
ప్రధాన వార్తలు

By

Published : Aug 5, 2021, 11:00 AM IST

  • రాష్ట్ర వ్యాప్తంగా 385 కేంద్రాల్లో పాలిసెట్‌
    పాలిటెక్నిక్‌లలో ప్రవేశం కోసం పాలిసెట్‌-2021ని సెప్టెంబరు 1వ తేదీన రాష్ట్రంలోని 385 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. మొత్తం 72 వేల సీట్లకు పాలిసెట్‌ నిర్వహిస్తుండగా.. ఇప్పటి వరకు 30,000 దరఖాస్తులు వచ్చాయి. పాలిసెట్ పరీక్ష దరఖాస్తు తేదీ ఆగస్టు 13న ముగియనుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • crop insurance scam: పంటబీమా పక్కదారి.. దర్జాగా దోచేశారు.
    అసలే పంట నష్టపోయి ఉన్నారు. పంటబీమా కొంతలో కొంతైనా ఉపశమనం ఇస్తుందనుకుంటే దాన్ని కూడా అక్రమార్కులు లాగేస్తున్నారు. తప్పుడు పత్రాలు సమర్పించి బీమా పరిహారాన్ని కాజేస్తున్నారు. రేపల్లే ప్రాంతంలో కొంతమంది గ్రీవెన్స్​లో ఫిర్యాదు చేయడంతో అక్రమాలు బయటికొచ్చాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • srisailam water flow : శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద
    శ్రీశైలం జలాశయానికి వరద క్రమంగా తగ్గుతోంది. గత కొన్ని రోజులుగా అధికంగా ఉన్న వరద ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 215టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 213.40 టీఎంసీలు ఉంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • శ్రీవారి సేవలో టేబుల్​ టెన్నిస్​ క్రీడాకారిణి నైనా జైస్వాల్
    తిరుమల శ్రీవారిని టేబుల్​ టెన్నిస్​ క్రీడాకారిణి నైనా జైస్వాల్​ దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. త్వరలో తన పీహెచ్​డీ పూర్తవుతుందని.. 21 సంవత్సరాలకే ఈ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డుకెక్కుతానని ఆమె అన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వరదల్లో చిక్కుకున్న హోంమంత్రి- రక్షించిన సిబ్బంది
    వరదల్లో ముంపునకు గురైన గ్రామాలను పరిశీలించేందుకు వెళ్లిన హోంమంత్రి.. వరదల్లోనే చిక్కుకున్నారు. భారత వైమానిక దళం చాపర్​ సాయంతో హోమంత్రిని రక్షించారు సహాయ సిబ్బంది. మరో ఏడుగురు గ్రామస్థులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వ్యాన్​ బోల్తా-10 మంది మృతి
    అమెరికాలో వ్యాన్​ బోల్తా పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరిలించిన అధికారులు.. వారంతా వలసదారులుగా భావిస్తున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పేటీఎంలో గ్యాస్‌ బుక్‌ చేస్తే రూ.2700 క్యాష్‌బ్యాక్‌!
    వినియోగదారులను ఆకర్షించేందుకు పేటీఎం సరికొత్త ఆఫర్​​ ప్రకటించింది. తమ యాప్​ ద్వారా సిలిండర్​ బుక్​ చేసుకునే వారికి క్యాష్​బ్యాక్​ అందిస్తామని పేర్కొంది. '3 పే 2700 క్యాష్‌బ్యాక్‌' పేరున వరుసగా మూడు నెలల పాటు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Tokyo Olympics: రెజ్లర్లకు నిరాశ.. వినేశ్, అన్షు మాలిక్ ఓటమి
    టోక్యో ఒలింపిక్స్​ క్వార్టర్​ ఫైనల్లో ఓటమి చవిచూసింది స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్. అయితే అప్పుడే ఆమె పోరు ముగిసిపోలేదు. కాంస్యం కోసం పోరాడేందుకు ఆమెకు మరో అవకాశం లభించే వీలుంది. అలాగే మరో రెజ్లర్ అన్షు మాలిక్ కూడా పరాజయం చెందింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నిహారిక ఇంటి వద్ద అర్ధరాత్రి గొడవ.. పరస్పరం ఫిర్యాదు!
    ఇటీవలే పెళ్లి చేసుకున్న నాగబాబు కుమార్తె నిహారిక నివసించే అపార్ట్​మెంట్​లో వివాదం జరిగినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో నిహారిక ఫ్లాట్​ వద్ద గొడవ జరిగింది. బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో ఆమె భర్తపై అపార్ట్​మెంట్ వాసులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నిహారిక భర్త చైతన్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details