ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Top News: ప్రధానవార్తలు @ 9AM - breaking news

Top News: ప్రధానవార్తలు @ 9AM

top news
ప్రధానవార్తలు @ 9AM

By

Published : Jul 28, 2021, 8:59 AM IST

  • arrest: అర్ధరాత్రి హైడ్రామా.. దేవినేని ఉమా అరెస్ట్‌
    కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీసులు.. తెదేపా నేతలను అరెస్టు చేశారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగిన దేవినేనిని అర్ధరాత్రి తర్వాత పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. అతనితో పాటు మాజీ మంత్రి పట్టాభి, ఎమ్మెల్యే బోడె ప్రసాద్​లను అరెస్టు చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CM Jagan: గ్రామ సచివాలయాలకు వెళ్లకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయి?: సీఎం
    కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాలను అధికారులు తరచూ తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సరిగా పర్యటనలకు వెళ్లని వారికి మెమోలు జారీచేయాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇసుక దొంగలు.. వైకాపాకు చెందిన వారే: రాజధాని రైతులు
    హైకోర్టు సమీపంలోనే.. కొందరు దుండగులు రాజధాని నిర్మాణానికి నిల్వ చేసిన డంప్‌ నుంచి ఇసుక తరలించారు. ట్రాక్టర్లు, జేసీబీలతో తోడుకుపోయారు. వైకాపాకు చెందిన వ్యక్తులే ఈ పని చేశారని రాజధాని రైతులు ఆరోపించారు. అమరావతి కోసం పోరాడుతున్న రైతులపై కేసులు పెడుతున్న పోలీసులు.. ఇసుక దొంగలపై ఎందుకు కేసులు పెట్టట్లేదని ప్రశ్నించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • New Taxes: ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వచ్చిన కొత్త పన్నులు..!
    ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచే కొత్త పన్నులు అమల్లోకి వచ్చినట్లు పుర కమిషనర్లు చెబుతున్నారు. మూల ధన విలువ ఆధారంగా విధించే కొత్త పన్నులకు అనుకూలంగా ఇప్పటికే కొన్ని పుర, నగరపాలక సంస్థల్లో తీర్మానం చేశారు. అనంతరం తుది నోటిఫికేషన్‌ ఇచ్చి, ఆ వివరాలతో ప్రజలకు ప్రత్యేక తాఖీదులు జారీ చేయనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బస్సు ట్రక్కు ఢీ- 18 మంది మృతి
    ఉత్తర్​ప్రదేశ్​లో ఓ డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 18 మంది మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెనక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీ కొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కన్నడ పీఠంపై బొమ్మై.. ముగిసిన యడ్డీ రాజకీయ ప్రస్థానం!
    దక్షిణాదిలో కాషాయ ధ్వజాన్ని రెపరెపలాడించిన యడియూరప్ప ప్రస్థానం దాదాపుగా ముగిసిపోయింది. నాలుగు సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మొత్తంగా అయిదేళ్ల పాటు అధికారాన్ని చలాయించినా- 78 ఏళ్ల వయసులో అయిష్టంగానే కుర్చీ దిగిపోవాల్సి వచ్చింది. లింగాయత్‌ వర్గానికే చెందిన యడ్డీ విధేయుడు బొమ్మై సారథ్యంలో 2023 ఎన్నికల్లో భాజపా మళ్ళీ విజయకేతనం ఎగురవేస్తుందా?పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కావాలని ఎవరూ బిచ్చగాళ్లుగా మారరు'
    యాచకులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కావాలని ఎవరూ బిచ్చగాళ్లుగా మారరని వ్యాఖ్యానించింది. యాచకులు వీధుల్లో తిరగకుండా తాము నిషేధం విధించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గురు గ్రహ చందమామపై నీటి ఆవిరి
    హబుల్‌ టెలిస్కోపు అందించిన తాజా, పాత డేటాల ఆధారంగా గానీమీడ్​ వాతావరణంలో నీటి ఆవిరిని నాసా గుర్తించింది. తీవ్ర శీతల పరిస్థితుల వల్ల అక్కడి ఉపరితలం మీద నీరు ఘనీభవించి ఉందని పేర్కొంది. రోజు మొత్తంలో ఈ చందమామ ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీగా వైరుధ్యాలు ఉంటున్నట్లు తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • olympics live: పీవీ సింధు విజయం.. రౌండ్​-16కు అర్హత
    స్టార్ షట్లర్ పీవీ సింధు ఆకట్టుకునే ప్రదర్శన చేసి రౌండ్-16లోకి ప్రవేశించింది. హాంకాంగ్​కు చెందిన చేంగ్ న్గాన్ యి పై 21-9, 21-16 తేడాతో గెలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'వీడు హీరోనా అన్నారు.. బోరున ఏడ్చేశా!'
    నటుడిగానే కాక సింగర్​గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ స్టార్​ హీరోగా ఎదిగాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగా గుర్తింపు తెచ్చుకున్నా.. తనకంటూ ఓ పంథా ఏర్పర్చుకున్నాడు. ఈ హీరో పుట్టినరోజు ఈరోజు. ఈ నేపథ్యంలో అతడి గురించిన ఆసక్తికర విషయాలు ఆయన మాటల్లోనే..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details