- NGT: రిజర్వాయర్ల నిర్మాణ వివాదంపై జోక్యం చేసుకోలేం.. ఏపీ రైతుల పిటిషన్‌పై ఎన్జీటీ
అనుమతులు లేకుండా గాలేరు- నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సుజల స్రవంతి పథకాల కింద రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారంటూ చిత్తూరు జిల్లా రైతులు దాఖలు చేసిన పిటిషన్‌లో జోక్యం చేసుకోలేమని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Exams: ఏపీపీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నలు మరింత కఠినంగా ఉంటాయా?
ఏపీపీఏస్సీలో ఇక నుంచి రాత పరీక్షలతోనే అభ్యర్థుల తలరాత మారనుంది. ఇప్పటివరకు రాత పరీక్షల్లో పోటాపోటీగా మార్కులు సాధించినా, మౌఖిక పరీక్షల్లో ముందు, వెనక అవుతున్నారు. ఒకవైపు మౌఖిక పరీక్షలను రద్దుచేయడంతో పాటు.. మరోవైపు గ్రూప్-1 మినహా మిగిలిన పోస్టుల భర్తీకి ఒక పరీక్షనే నిర్వహించాలని ఏపీపీఏస్సీ ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో ప్రశ్నపత్రం ఎలా ఉంటుందన్న దానిపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Polavaram: ‘పోలవరం’ గేట్ల పొడవునా చేరిన నీరు
పోలవరం ప్రాజెక్టు వద్ద అప్రోచ్ ఛానల్ వెంబడి వేసిన మట్టికట్ట.. సోమవారం మధ్యాహ్నం తెగింది. ఈ క్రమంలో నీరు.. స్పిల్‌వేలోని 48 గేట్ల పొడవునా నీరు చేరిందని.. తెల్లరేసరికి క్రస్టుగేట్ల అన్నింటి పైనుంచి నీరు ప్రవహించే అవకాశం ఉందని గుత్తేదారు ప్రతినిధులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Logistics committee: రాష్ట్ర స్థాయి లాజిస్టిక్స్ సమన్వయ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
జాతీయ లాజిస్టిక్స్ పాలసీలో భాగంగా.. రాష్ట్ర స్ఠాయిలో లాజిస్టిక్స్ సమన్వయ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ నేతృత్వంలో.. 11 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి లాజిస్టిక్స్ కో-ఆర్డినేషన్ కమిటీ నియమించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉత్తరాఖండ్‌లో అసమ్మతి సెగలు- భాజపాలో పదవీ పదనిసలు
హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి బాధ్యతలు స్వీకరించారు. పార్టీలో, ప్రభుత్వంలో కీలక బాధ్యతలను అప్పగించే సందర్భంలో నాయకుల వ్యక్తిగత పేరుప్రతిష్ఠలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోని భాజపా అధిష్ఠానం వైఖరి దీనితో మరోసారి తేటతెల్లమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మాటలు కాదు.. చేతల్లో చూపండి'