ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM - ఏపీ ప్రధాన వార్తలు

.

top news
top news

By

Published : May 22, 2021, 2:59 PM IST

  • 'ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైనా దాడులకు దిగుతున్నారు'
    రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన కలుగుతోందని.. బాధగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా అనేక తీర్పులు ఇచ్చినా... ఇంకా ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోలేదని దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆనందయ్య ఇచ్చే కరోనా మందు మంచిదా? కాదా?
    ఆనందయ్య... ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చిన ఒక సామాన్య మూలికా వైద్యుడి పేరు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం కరోనా వైద్యానికి ప్రధాన కేంద్రంగా మారడానికి ఈయనే ప్రధాన కారణం. లక్షల కొద్దీ ఫీజులు చెల్లించేందుకు సిద్థంగా ఉన్నప్పటికీ ఆసుపత్రులలో పడకలు దొరకని పరిస్థితులలో ఆనందయ్య అందరికీ ఒక ఆశాకిరణంగా మారారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఇంకా అందని బెయిల్ పత్రాలు.. ఎంపీ రఘురామ సోమవారం విడుదలయ్యే అవకాశం!
    నరసాపురం ఎంపీ రఘురామ.. బెయిల్​పై సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాలు రఘురామ న్యాయవాదులకు ఇంకా చేరనందున.. ప్రక్రియ ఆలస్యమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆదివారం కేంద్ర విద్యాశాఖ కీలక సమావేశం
    కొవిడ్ రెండోదశ విజృంభణ దృష్ట్యా వాయిదా పడ్డ 12వ తరగతి పరీక్షలపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ ఆదివారం సమావేశం కానుంది. వర్చువల్​గా జరిగే ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​​ సింగ్ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • సువేందు అధికారి తండ్రికి 'వై ప్లస్'​ భద్రత
    బంగాల్​ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తండ్రి, శిశిర్​ కుమార్ అధికారికి, సోదరుడు దివ్యేందు అధికారికి 'వై ప్లస్​' భద్రతను కల్పించింది కేంద్రం హోం శాఖ. వీరిద్దరికీ ముప్పు పొంచిఉందని కేంద్ర నిఘా వర్గాలు తమ నివేదికలో వెల్లడించగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • హగ్స్​, షేక్​హ్యాండ్స్​తో శ్వేతసౌధం​లో మళ్లీ పాతరోజులు
    శ్వేతసౌధంలో మాస్కులు తొలగిపోయాయి. సందర్శకుల నవ్వులు విరబూశాయి. కౌగిలింతలు కనువిందు చేశాయి. అతిథులకు ఆడంబర ఆహ్వానాలు లభించాయి. మొత్తంగా పాతరోజులు మళ్లీ తిరిగొచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆంగ్​సాన్​ సూకీ పార్టీ రద్దుకు ఈసీ నిర్ణయం!
    మయన్మార్​లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నేషనల్​ లీగ్​ ఫర్ డెమోక్రెసీ పార్టీని రద్దు చేయాలని ఆ దేశ ఎన్నికల సంఘం భావిస్తోంది. ఎన్నికల్లో ఆ పార్టీ అవినీతికి పాల్పడిందని ఈసీ ఆరోపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • '2020లో 81% భారతీయ కంపెనీల డేటా చోరీ'
    గతేడాది 81 శాతం భారతీయ సంస్థల్లో డేటా చోరీ జరిగిందని ఓ అంతర్జాతీయ సర్వే వెల్లడించింది. అందుకు భద్రతా లోపాలు ప్రధాన కారణమని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • పరుగుల కోసం కోచ్ రవిశాస్త్రి నయా ఫార్ములా!
    ఇంగ్లాండ్ పర్యటనలో అదరగొట్టేందుకు సిద్ధమవుతోంది టీమ్ఇండియా. ఇంగ్లీష్ పిచ్​లపై బ్యాట్స్​మెన్ సెంచరీలు బాదడానికి కోచ్ రవిశాస్త్రి మూడు కొత్త ప్రణాళికలు రచించారట. అవేంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మరో స్పోర్ట్స్​ డ్రామాలో నేచురల్ స్టార్!
    హీరో నాని మరో స్పోర్ట్స్ డ్రామా కథాంశంతో తెరకెక్కబోయే సినిమాలో నటించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో నాని ఫుట్​బాల్​ ప్లేయర్​గా కనిపించనున్నారని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details