ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @11 AM

.

top news
top news

By

Published : May 14, 2021, 10:58 AM IST

  • ఏపీ తెలంగాణ బోర్డర్ : మరోసారి అంబులెన్సులను నిలిపేసిన తెలంగాణ పోలీసులు

రాష్ట్రానికి చెందిన అంబులెన్సుల మరోసారి తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని పుల్లూరు టోల్‌ గేట్‌ వద్ద అత్యవసర వైద్య సేవల వాహనాలను నిలిపివేశారు. ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తామని పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కూర్చున్న చోటే మహిళ ప్రసవం.. మంత్రి ఆరా

కూర్చున్న చోటే ఓ మహిళ ప్రసవించడంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ఈ మేరకు బాధితురాలికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కరోనా చికిత్సకు ఇస్రో ఆక్సిజన్‌ సరఫరా


కరోనా బాధితుల కోసం ఇస్రో ప్రాణవాయువును సమకూరుస్తోంది. ప్రయోగ కేంద్రం షార్‌ నుంచి నెల్లూరు జిల్లాలోని ఆసుపత్రులకు ఆక్సిజన్​ను పంపుతోంది. 2 రోజుల వ్యవధిలో 24 టన్నుల ఆక్సిజన్‌ను జిల్లా కేంద్రానికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • దేశంలో మరో 3.43 లక్షల కేసులు, 4వేల మరణాలు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం మరో 3,43,144 మంది వైరస్​ బారినపడ్డారు. కొవిడ్​ కారణంగా మరో 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఎన్నికల నిర్వహణపై సమీక్షకు ప్రత్యేక కమిటీ

ఇటీవల జరిగిన ఎన్నికల నిర్వహణలో ఈసీ పనితీరును, లోపాలు, సమస్యలపై సమీక్షించేందుకే కోర్​ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కమిటీ సిఫార్సుల మేరకు సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. నెల రోజుల్లోగా కమిటీ నివేదిక సమర్పించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • దారుణం: యువతిపై 25మంది అత్యాచారం

హరియాణలో దారుణ ఘటన వెలుగుచూసింది. పల్వాల్​ జిల్లాలో యువతిపై 25మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలోని రోడ్​ ఐలాండ్​లో రెండు బృందాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 9 మంది గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • గోఫస్ట్‌గా పేరు మార్చుకున్న గోఎయిర్‌.. ఎందుకంటే!


ప్రముఖ విమానయాన సంస్థ గో ఎయిర్​ తన బ్రాండ్​ పేరును మార్చుకుంది. పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో.. 'గోఫస్ట్'​గా వస్తోంది ఈ చౌక ధరల విమాన కంపెనీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'ఐపీఎల్​ను తిరిగి నిర్వహించడం సవాలే'​


కొవిడ్ నేపథ్యంలో నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్​ను తిరిగి నిర్వహించడం సవాలుతో కూడినదని పేర్కొన్నారు రాజస్థాన్​ రాయల్స్​ యజమాని మనోజ్ బదాలే. ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనేదే కష్టమైన అంశమని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • త్వరలోనే పూర్తిగా కోలుకుంటా: ఎన్టీఆర్

ఇటీవలే కరోనా బారినపడిన యంగ్​టైగర్ ఎన్టీఆర్​ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు. రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details