- ఎస్కార్ట్ వాహనం మీదకు దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు పోలీసులు మృతి
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం ఉండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నహెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు ఎన్.ఎస్.రెడ్డిలపై అర్ధరాత్రి 2 గంటల సమయంలో లారీ బీభత్సం సృష్టించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ‘ప్రాణవాయువు రథచక్రాలు’ వచ్చేశాయ్!
ప్రభుత్వాసుపత్రిలో బెడ్లకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన ‘ఆక్సిజన్ పడకల ఆర్టీసీ బస్సులు’ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద ప్రయోగాత్మకంగా ప్రారంభమయ్యాయి. ‘జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు’ పేరిట సిద్ధం చేసిన రెండు బస్సులను రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ గురువారం ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ కొవిడ్ వార్డులో ఆభరణాలు మాయం.. పోలీసులతో బాధితుల వాగ్వివాదం
కొవిడ్ వార్డులో ఆభరణాలు మాయమైన ఘటన విశాఖ నగర పరిధిలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. స్థానిక సీఎస్ఆర్ బ్లాకులోని కరోనా చికిత్స గదిలో ఈ కలకలం జరిగింది. ఈ మేరకు మృతదేహాల నుంచి బంగారు ఆభరణాలు అదృశ్యమవుతున్నాయని సంబంధిత కుటుంబీకులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆ అధికారం రాష్ట్రాలకు ఇవ్వండి'
ఎస్ఈబీసీ రిజర్వేషన్ల జాబితాలో కొత్తవాటిని చేర్చడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంను కోరింది. ఈ మేరకు గురువారం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని కోరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోలుకున్న వారిలోనూ.. కొత్త ముప్పు
బ్లాక్ ఫంగస్ శరీరంలోకి వ్యాపించిన రెండు మూడు రోజుల్లోనే ముఖభాగంలోని అవయవాలను కబళించేస్తుంది. తొలుత ముక్కులోపలి భాగంలో చేరి క్రమంగా కళ్లు, చెవులు, దవడలకు, తర్వాతి దశలో మెదడులోకి విస్తరిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమెరికాలో ఇక మాస్క్ లేకుండా తిరగొచ్చు!