ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - ఏపీ ముఖ్యవార్తలు

.

Top News
Top News

By

Published : Mar 28, 2021, 9:00 AM IST

  • నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, 8 మంది దుర్మరణం

నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • అనారోగ్యంతో.. బద్వేల్ ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య కన్నుమూత

కడప జిల్లా బద్వేల్ శాసనసభ్యుడు డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతిచెందారు. కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్ను మూశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 31 నుంచి మేయర్‌, పుర ఛైర్మన్ల సదస్సు.. హాజరుకానున్న సీఎం జగన్

నూతనంగా ఎన్నికైన మేయర్, ఉప మేయర్, మునిసిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల రాష్ట్రస్థాయి సదస్సు ఈ నెల 31 నుంచి 2 రోజుల పాటు విజయవాడలో జరగనుంది. ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 11 నెలల్లో రూ.79,191 కోట్ల రుణం.. దేశంలోనే ఇది అత్యధికం!

రాష్ట్ర ప్రభుత్వం అప్పులు మోత మోగిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు (11 నెలల్లో) రూ.79,191 కోట్ల అప్పులు తీసుకున్నట్లు కాగ్‌ లెక్కలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో పొందుపరిచిన అంచనాలతో పోలిస్తే 63.97% మేర రుణాలు అధికంగా సేకరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'న్యాయమూర్తులపై దూషణలు.. ఏమాత్రం మంచిది కాదు'

తమకు నచ్చిన విధంగా తీర్పులు రాకపోతే.. న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో కొంతమంది దూషణలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్​ ప్రసాద్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • దేశంలో 5.94 కోట్ల కరోనా టీకా డోసుల పంపిణీ

దేశంలో ఇప్పటివరకు 5.94 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. శనివారం ఒక్కరోజే 13.83 లక్షల టీకా డోసులు అందించినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'టీకా ఉత్పత్తిని పెంచేందుకు నిధులివ్వండి!'

కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ ముప్పుతో టీకా ఉత్పత్తిపై ఆయా కంపెనీలకు ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్‌ను పెద్దఎత్తున ఉత్పత్తి చేసేందుకు వీలుగా రూ.100 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారత్‌ బయోటెక్‌ కోరినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఫలించని ప్రయత్నాలు- కదలని 'ఎవర్ గివెన్'

సూయిజ్ కాలువలో ఇరుక్కుపోయిన భారీ నౌకను కదిలించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించటం లేదు. ఇక్కడ రాకపోకలు ఎప్పుడు పునరుద్ధరణ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే, ప్రస్తుత ప్రయత్నాలు కలిసిరాకపోతే.. కంటైనర్లను తొలగించైనా నౌకను బయటకు తీస్తామని 'ఎవర్ గివెన్' యాజమాన్య సంస్థ అధ్యక్షుడు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'ధోనీతో మాట్లాడాకే బ్యాటింగ్​లో రెచ్చిపోయా!'

గతేడాది జరిగిన ఐపీఎల్​లో తాను బ్యాటింగ్​లో రాణించడానికి కారణం కెప్టెన్ ధోనీ అని అంటున్నాడు సీఎస్​కే బ్యాట్స్​మన్​ రుతురాజ్​ గైక్వాడ్​. ధోనీతో మాట్లాడిన తర్వాతే తాను స్వేచ్ఛగా బ్యాటింగ్​ చేశానని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • అభిమానులు​ గర్వపడేలా చేస్తా: నాని

అందరిలా తనకోసం అభిమానులు కటౌట్లు కట్టడం.. పాలాభిషేకాలు చేయడం అవసరం లేదని అంటున్నారు కథానాయకుడు నాని. హీరోగా తన ఫ్యాన్స్​ గర్వపడేలా ప్రతిరోజూ కష్టపడుతూనే ఉంటానని.. 'టక్​ జగదీష్'​ పరిచయ వేడుక కార్యక్రమంలో ఆయన వెల్లడించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details