- రాజధాని భూముల కేసుపై ఏపీ హైకోర్టు స్టే
ఏపీ రాజధాని భూములకు సంబంధించి అవినీతి నిరోధకశాఖ (అనిశా) నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు నిందితులపై విచారణ, దర్యాప్తులను నిలిపివేసింది. ఎఫ్‌ఐఆర్ వివరాలను ప్రింట్, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల ద్వారా బహిర్గతం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు... దెబ్బతిన్న పంటలు
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో సీమ ప్రాంతంలోని ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటికి సంబంధించిన లెక్కలను వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇవాళ, రేపు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రేపటి నుంచే ఏపీ ఎంసెట్.. విస్తృతంగా ఏర్పాట్లు
గురువారం నుంచి ఏపీ ఎంసెట్ ప్రారంభం కానుంది. ఏపీ, తెలంగాణలో కలిపి 118 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రవేశ పరీక్షల ప్రత్యేకాధికారి సుధీర్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- విజయవాడ దుర్గమ్మ వెండి రథం సింహాల ప్రతిమలు అదృశ్యం?
విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథంలోని సింహాలపై వస్తున్న వార్తలు దేవాలయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతర్వేది ఘటన తర్వాత రథాల పరిశీలన, భద్రత అంశాలపై పోలీసులు ఈనెల 13న సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో వెండి రథాన్ని అధికారులు పరిశీలించగా... సింహాల ప్రతిమ కనపడలేదన విషయాన్ని గుర్తించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 'ప్లాస్మా థెరపీతో మరణాలు తగ్గలేదు'
భారత్లో కరోనా మరణాలు అదుపులోనే ఉన్నాయని తెలిపారు భారతీయ వైద్య పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ. ఒకసారి కరోనా వచ్చినవారికి రెండోసారి వైరస్ సోకే ముప్పు చాలా తక్కువని స్పష్టం చేశారు. అయితే ప్లాస్మా థెరపీ వల్ల కొవిడ్ మరణాలు తగ్గలేదని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఎముకలు కొరికే చలిలోనూ యుద్ధానికి సంసిద్ధం!