- రైతుల బకాయిలు రూపాయి లేకుండా చెల్లించండి: సీఎం
చక్కెర పరిశ్రమల పునరుద్ధరణపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈనెల 8న రైతు దినోత్సవం నాటికి... రైతులు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏ దరికి చేరునో.. రఘురామరాజకీయం..!
మాటకు మాట అన్నరీతిలో సాగిన ఎంపీ రఘురామకృష్ణరాజు పంచాయితీ స్పీకర్ వరకు చేరింది. పార్లమెంట్లో తెలుగుభాషపై చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం ...షోకాజ్ నోటీసులు జారీ చేసే వరకు వచ్చింది. అంతేకాదు షోకాజ్ పై తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు రాజుగారు. సమస్య తీవ్రత గుర్తించిన వైకాపా.... సభాపతికి ఫిర్యాదు చేసింది. అయినా వెనక్కి తగ్గని నరసాపురం ఎంపీ... హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్
గుంటూరు జిల్లా పొన్నూరు శాసనసభ్యుడు కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని రోశయ్య స్వయంగా వెల్లండించారు. ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే వైరస్ బారిన పడినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో కొత్తగా 837 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 837 మందికి కరోనా సోకింది. ఇందులో రాష్ట్రానికి చెందిన 789 మందికి ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన 46 మందికి, ఇతర దేశాలనుంచి ఏపీకి వచ్చిన మరో ఇద్దరికి కోవిడ్ నిర్ధరణ అయ్యింది. కరోనాతో మరో 8 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'విస్తరణవాద శకం ముగిసింది- ఇది అభివృద్ధి యుగం'
లద్దాఖ్‌లో ఆకస్మిక పర్యటన చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చైనాపై పరోక్ష విమర్శలు చేశారు. చరిత్రలో విస్తరణవాద శక్తులు ఓడిపోవడమో.. తోకముడవడమో జరిగిందన్నారు. సరిహద్దులో సైన్యం ప్రదర్శిస్తున్న శౌర్యపరాక్రమాలను కొనియాడారు. సైనికుల ధైర్యం నుంచే ఆత్మనిర్భర భారత్ సంకల్పం బలపడుతుందన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దిల్లీలో భూకంపం- రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రత