ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - ఏపీ ప్రధాన వార్తలు

.

TOP NEWS
TOP NEWS

By

Published : Jul 1, 2020, 8:59 PM IST

  • అచ్చెన్నాయుడు డిశ్చార్జ్‌

తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును గుంటూరు జీజీహెచ్‌ నుంచి డిశ్చార్జి చేశారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయిన అచ్చెన్నాయుడును....అవినీతి నిరోధకశాఖ ఆదేశాలతో జూన్ 13న జీజీహెచ్‌లో చేర్పించారు. ఇప్పుడు గుంటూరు జీజీహెచ్‌ నుంచి డిశ్చార్జి చేసి....విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. విజయవాడ సబ్‌ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కొత్త 108, 104 వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్‌

అత్యాధునిక పరికరాలతో రూపుదిద్దుకున్న నూతన 108, 104 వాహనాలు రోడ్డెక్కాయి. 201 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన 1068 కొత్త వాహనాల సేవలను ముఖ్యమంత్రి జగన్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా 657 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15, 252కు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆగస్టు చివరి వారంలో పార్లమెంట్​ సమావేశాలు!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్​ తొలివారంలో నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తేదీలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సివిల్స్​ ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాల మార్పునకు ఓకే

సివిల్​ సర్వీసెస్​ ప్రిలిమినరీ​ పరీక్ష కేంద్రాల మార్పునకు అనుమతించింది యూపీఎస్​సీ. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 7 తర్వాత యూపీఎస్​సీ వెబ్​సైట్​ ద్వారా మార్చుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత్​-చైనా మధ్య మరిన్ని 'శాంతి' చర్చలు!

సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్​-చైనా మధ్య సైనిక, దౌత్య స్థాయిలో మరిన్ని చర్చలు జరిగే అవకాశమున్నట్టు సమాచారం. మంగళవారం కార్ప్స్​ కమాండర్​​ స్థాయిలో జరిగిన చర్చల్లో.. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్టు భారత సైనిక వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ప్రపంచ దేశాలు ఆ రెండింటికీ ప్రాధాన్యతనివ్వాలి'

కరోనా​ నుంచి బయటపడేందుకు ఆరోగ్యం సహా ఆర్థిక వ్యవస్థకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ దేశాలను కోరింది డబ్ల్యూహెచ్​ఓ. వైరస్​ వ్యాప్తి అధికమయ్యే అవకాశమున్న నేపథ్యంలో అందరిని సిద్ధం చేస్తున్నట్టు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రూ.50వేలకు చేరువైన 10 గ్రాముల బంగారం ధర

బంగార, వెండి ధరలు బుధవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.647 ఎగబాకింది. వెండి ధర కిలోకు ఏకంగా రూ.51 వేలు దాటింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆస్కార్​ సభ్యులుగా ఆలియా భట్, హృతిక్ రోషన్​

బాలీవుడ్​ తారలు ఆలియాభట్​, హృతిక్​ రోషన్​ తదితరులకు అకాడమీ అవార్డ్స్(ఆస్కార్స్)​ సభ్యులుగా చేరేందుకు ఆహ్వానం అందింది. దీనిని అంగీకరించిన వారు, వచ్చే ఆస్కార్​ అవార్డులు ఓటింగ్​లో పాల్గొనే అవకాశం దక్కించుకోనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐసీసీ ఛైర్మన్​ పదవి నుంచి తప్పుకున్న శశాంక్​

అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ)ఛైర్మన్​​ పదవికి శశాంక్​ మనోహర్​ బుధవారం రాజీనామా చేశారు. మళ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యే వరకు డిప్యూటీ ఛైర్మన్​గా ఉన్న ఇమ్రాన్​ ఖ్వాజా తాత్కాలిక బాధ్యతలు చేపట్టనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details