- కొత్త 108, 104 వాహనాలను రేపు ప్రారంభించనున్న సీఎం
ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెస్తున్న 108, 104 వాహనాలను సీఎం జగన్ రేపు ప్రారంభించనున్నారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వైఎస్సార్ తెచ్చిన 108, 104 సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆయన అన్నారు. ప్రతి మండలంలో ఒక 108, 104 వాహనం అందుబాటులో ఉంటాయని మంత్రి చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విశాఖ సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్...ఇద్దరు మృతి
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరువక ముందే మరో గ్యాస్ లీకేజీ ప్రమాద ఘటన విషాదం నింపింది. పరవాడ ఫార్మా సిటీలో రసాయన వాయువు ఇద్దరి ఆయువు తీసింది. వెంటనే సిబ్బంది లీకేజ్‌ను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాద తీవ్రతను కట్టడి చేయగలిగారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉద్యోగినిపై అధికారి దాడి: నిందితునిపై నిర్భయ కేసు
నెల్లూరు జిల్లా ఏపీ టూరిజం కార్యాలయంలో ఉద్యోగినిపై దాడికి పాల్పడిన భాస్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్భయ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్... భాస్కర్‌ను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో కొత్తగా 704 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 704 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 14,595కు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మరో 5 నెలలు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ'
జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. "ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన"ను నవంబర్ చివరి వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయంతో 80కోట్ల మంది ప్రజలు లబ్ధిపొందుతారని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌లో 4.5 కోట్ల మంది మహిళలు మిస్సింగ్!