- చిన్న పరిశ్రమలకు అండగా ప్రభుత్వం
కరోనాతో కుదేలైన పారిశ్రామిక రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పరిశ్రమలు తిరిగి కోలుకునేందుకు సకాలంలో రాయితీలు చెల్లించడం సహా అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సీఎంకు విధేయుడినే.. అందుకే తప్పించేందుకు స్కెచ్ వేశారు'
పార్టీ వేరు, ప్రభుత్వం వేరని తాను అన్నానని.. ఇది వైకాపా నాయకులకు ఎందుకు అర్థం కావడం లేదో తనకు తెలియదని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించిన తనకు షోకాజ్ నోటీసులు ఎందుకిచ్చారో ఇప్పటికీ అర్థం కావడంలేదన్నారు. పార్టీకి తాను ఎప్పటికీ బద్ధుడినేనని ఈటీవీ భారత్‌తో చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో కొత్తగా 793 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 793 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13,891కి చేరింది. ఇవాళ నమోదైన కేసుల్లో 706 మంది స్థానికులు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 81 మంది ఉన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ఆరుగురికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- వైకాపా నేత దారుణ హత్య.. నిందితుల కోసం పోలీసుల గాలింపు
కృష్ణా జిల్లా మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్, మంత్రి పేర్నినాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు హత్యకు గురయ్యారు. ఉదయం చేపల మార్కెట్ వద్ద ఉండగా దుండగులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలైన భాస్కరరావును జిల్లా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మంగళవారం భారత్-చైనా సైన్యాధికారుల భేటీ
భారత్-చైనా మధ్య లెఫ్టినెంట్ జనరళ్ల స్థాయిలో మంగళవారం సమావేశం జరగనుంది. ఈ భేటీకి చుషుల్ ప్రాంతం వేదికకానుంది. ఇరు దేశాల మధ్య ఈ తరహా సమావేశం జరగడం ఇది మూడోసారి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్వల్పంగా దిగొచ్చిన పసిడి.. నేటి ధరలు ఇవే