ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM

..

TOP NEWS
ప్రధానవార్తలు

By

Published : Jun 28, 2020, 7:00 PM IST

  • కోటి పరిహారం ఇవ్వాలి..
    ఎస్పీవై గ్యాస్​ లీక్​ మృతుడి కుటుంబానికి పరిహారం విషయంలో బేరసారాలు తగవని.. కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్​ చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • విద్యార్థినిపై లైంగికదాడిలో కొత్తకోణం..
    గుంటూరులో విద్యార్థినికి లైంగిక వేధింపుల కేసులో ఇద్దరు యువతుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధిత యువతి నగ్న వీడియోలు వీరి ద్వారానే ఓ నిందితుడికి అందినట్లు దర్యాప్తులో తేలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హైదరాబాద్​లో మళ్లీ లాక్​డౌనా..?
    తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహం... హైదరాబాద్‌ పరిధిలో కొద్ది రోజుల పాటు లాక్​డౌన్ విధించాలనే ప్రతిపాదనలపైనా... సీఎం కేసీఆర్​ ప్రగతి భవన్​లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సీబీఐకి లాకప్​డెత్ కేసు..
    దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన తమిళనాడు తండ్రీకొడుకుల లాకప్​డెత్​ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టుకు నివేదిస్తామని వెల్లడించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాహుల్​కు 'షా' సవాల్​!
    చైనాతో సరిహద్దు ఘర్షణపై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు హోంమంత్రి అమిత్​షా. ఏఎన్​ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో కాంగ్రెస్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. 1962 నుంచి చైనాతో సంబంధాలపై పార్లమెంట్ వేదికగా చర్చిద్దామా? అని సవాల్​ విసిరారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చుక్కలనంటిన ఫ్లాట్​ ధర..!
    ముంబయిలోని లోయర్​ పరేల్​లో ఉన్న ఓ ఫ్లాట్ ఈ ఏడాది అత్యధిక ధరకు​(రూ.136కోట్ల 27లక్షలు) అమ్ముడుపోయింది. మిలియనీర్లు నీరజ్​ కొచర్, కనికా ధ్రువ్​ కొచర్​లు​ ఈ ఫ్లాట్​ను కొనుగోలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఘర్షణకు ముందే మార్షల్​ ఆర్ట్స్​ యోధులు .!
    చైనా పక్కా ప్రణాళికతోనే గల్వాన్​ లోయలో భారత సైనికులపై దాడికి యత్నించినట్లు సమాచారం. ఈ ఘటనకు కొద్దిసేపటి ముందు తన మార్షల్​ ఆర్ట్స్​ యోధులను ఆ ప్రాంతాల్లో మోహరించినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మా వ్యాక్సిన్​తో కచ్చితమైన ఫలితాలు..
    చైనా నేషనల్ బయోటెక్ ప్రకటన కొత్త ఆశలను చిగురింపజేసింది. తమ వ్యాక్సిన్​ కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని చెప్పింది. 1,120 మందిపై వ్యాక్సిన్​ను ప్రయోగించగా.. వీరందరిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆర్జీవీ కొత్త చిత్రం.. 'పవర్ స్టార్'
    లాక్​డౌన్​లోనూ వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నాడు దర్శకుడు రామ్​గోపాల్ వర్మ. తాజాగా తన కొత్త సినిమా 'పవర్ స్టార్' అంటూ ప్రకటించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టాప్​ లేచిపోద్ది అంటోన్న డేవిడ్ వార్నర్
    ఆస్ట్రేలియా క్రికెటర్​ డేవిడ్​ వార్నర్​ మరో టిక్​టాక్ వీడియో షేర్ చేశాడు. 'ఇద్దరమ్మాయిలతో' సినిమా నుంచి 'టాప్​లేచిపోద్ది' పాటకు వీడియో జత చేసి పోస్ట్ చేశాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details