- సీఎం జగన్ జల చౌర్యం..
సీఎం జగన్ తన సొంత వ్యాపార సంస్థ కోసం జల చౌర్యానికి పాల్పడ్డారని తెదేపా నేత పట్టాభిరాం ధ్వజమెత్తారు. సరస్వతీ ఇండస్ట్రీస్‌కు నిబంధనల ప్రకారం అనుమతించిన దానికంటే రెట్టింపు నీటిని మళ్లిస్తూ జారీ చేసిన జీవో అక్రమమని ఆయన ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు..
వైకాపా ప్రభుత్వానికి నిబంధనలు పట్టవని... ప్రజాస్వామ్య విలువలు కనపడవని తెదేపా నేత కొల్లు రవీంద్ర విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉద్యమాన్ని ఉద్ధృతం చేద్దాం..
రాజధాని అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని వివిధ రాజకీయపక్షాలు, రైతు, ప్రజాసంఘాలు తీర్మానించాయి. రాజధాని రైతుల ఉద్యమం జులై 4తో 200 రోజులకు చేరుతున్న సందర్భంగా గుంటూరు సీపీఐ కార్యాలయంలో రాష్ట్రస్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌లో మరో ఫ్లాయిడ్..
తమిళనాడు ట్యూటికోరిన్లో తండ్రి, కొడుకుల లాకప్ డెత్ ఘటన మరువకముందే పోలీసుల మరో దురాగతం బయటపడింది. ఓ ఆటోడ్రైవర్‌ను తీవ్రంగా కొట్టగా.. అవయవాలు విఫలమై ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆ రాష్ట్రంలోనే వెలుగుచూసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మంత్రి ఇల్లు జలమయం..
బిహార్ పట్నాలోని వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరడం వల్ల ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఇంటితో పాటు అనేక ఇళ్లు జలమయమయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 21 జిల్లాలపై ప్రభావం
- అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అసోంలో 21 జిల్లాల్లోని 4,62,777 ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అంతరిక్షంపై అంకురాల ఆసక్తి..
అంతరిక్ష రంగ కార్యకలాపాల్లో ప్రైవేటు సంస్థలకు కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో అంకురాలు ఆసక్తి చూపుతున్నట్లు ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సోదరుడికి సారీ చెప్పిన కుక్క..
ప్రేమ, ఆప్యాయత చూపించడం, అలగడం, హగ్ చేసుకోవడం మనుషులకేనా... మాకూ తెలుసు అంటున్నాయి రెండు కుక్కలు. తాజాగా ఓ శునకం తన సోదరుడికి సారీ చెప్పిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏ ఆడిషన్‌లోనూ విఫలమవ్వలేదు..
బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌కు భావోద్వేగపు నివాళి అర్పించాడు దర్శకుడు ముఖేష్ చబ్రా. సుశాంత్‌కు సంబంధించిన ఆడిషన్లు సహా కొన్ని సన్నివేశాలను కలిపి వీడియోను ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఛాంపియన్‌షిప్‌ను పొడిగించాలి
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ షెడ్యూల్‌ను పొడిగించాలని కోరింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. తద్వారా కరోనా వల్ల రద్దయిన ఎనిమిది టెస్టులు అడేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.