- దిశ మార్చుకున్న 'అసని'.. రాష్ట్రంలో అతిభారీ వర్షాలకు ఛాన్స్!
తీవ్ర తుపానుగా కొనసాగుతున్న "అసని".. దిశ మార్చుకుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు సాయంత్రంలోగా మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తప్పు చేస్తే ఎవరినీ వదలం.. చేయలేదని నిరూపించుకోగలరా? : మంత్రి బొత్స
పదో తరగతి పేపర్‌ను వాట్సాప్‌లో పంపి మాస్ కాపీయింగ్‌కు యత్నించారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సచివాలయంలో సీఎం జగన్‌ను కలిసిన మంత్రి బొత్స.. పదోతరగతి పేపర్ లీకేజీ కేసులో నారాయణ అరెస్టు, ఇతర అంశాలపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్టు: చంద్రబాబు
మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ అరెస్టును తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. పరీక్షల నిర్వహణా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేశారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పరిశ్రమలకు పవర్ హాలిడే ఉపసంహరిస్తున్నాం : మంత్రి పెద్దిరెడ్డి
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గడంతో పరిశ్రమలకు విధించిన పవర్ హాలిడేను ఉపసంహరిస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శ్రీవారి పరకమణిలో చోరీ.. పోలీసుల అదుపులో నిందితుడు
శ్రీవారి ఆలయ పరకమణిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చోరీకి పాల్పడినట్లు తితిదే అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'దేశద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదు?'
దేశద్రోహం చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పునఃపరిశీలన పూర్తి చేసే వరకు ఈ చట్టం కింద చర్యలు తీసుకోకుండా రాష్ట్రాలను ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బైక్‌కు దారి ఇవ్వలేదని.. కర్రలతో కొట్టి బస్సు డ్రైవర్ దారుణ హత్య
ద్విచక్రవాహనానికి దారి ఇవ్వలేదని ఓ వ్యక్తిని కొట్టిచంపారు దుండగులు. మహారాష్ట్ర పుణెలోని ఆంద్గావ్లో జరిగిందీ ఘటన. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పుతిన్ పిలుపుతో రష్యా సేనల దూకుడు.. ఆ దాడుల్లో 44మంది మృతి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విక్టరీ డే ప్రసంగం అనంతరం.. ఆ దేశ సేనలు ఉక్రెయిన్‌పై భీకరంగా దాడులు చేస్తున్నాయి. వ్యూహాత్మకంగా ఉక్రెయిన్ పరిశ్రమలపై దృష్టిపెట్టాయి. కాగా, రెండు నెలల క్రితం రష్యా చేసిన బాంబు దాడుల్లో 44 మంది చనిపోయినట్లు తాజాగా వెల్లడైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మహేశ్-రాజమౌళి సినిమా షూటింగ్‌పై విజయేంద్రప్రసాద్ క్లారిటీ
సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించనున్న సినిమాపై క్లారిటీ ఇచ్చారు రచయిత విజయేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది సినిమా మొదలవుతుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 41 ఏళ్ల వయసులో హీరోయిన్ ప్రెగ్నెంట్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!
'సొంతం', 'జెమినీ' చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్న ఒకప్పటి ముద్దుగుమ్మ నమిత. 2017లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ భామ... త్వరలోనే తల్లి కాబోతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @5PM