ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 10, 2022, 8:59 PM IST

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

.

top news
top news

  • తీరం వైపు దూసుకొస్తున్న 'అసని'.. అధికారుల అప్రమత్తం
    బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా కొనసాగుతున్న 'అసని'.. దిశ మార్చుకొని తీరంవైపు దూసుకొస్తోంది. రేపు సాయంత్రంలోగా మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మాజీ మంత్రి నారాయణ అరెస్టు !
    మాజీమంత్రి నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. తొలుత హైదారాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత అరెస్టు చేసినట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారంలో ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు
    రాజధాని మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు డిజైన్‌లో అక్రమాలపై మంగళగిరి సీఐడీకి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ డబ్బును కేంద్రం నుంచి రాబట్టాలి: సీఎం జగన్
    పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2,559 కోట్ల రూపాయలను కేంద్రం నుంచి రాబట్టాలని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సత్వరమే రాబట్టేలా చర్యలు తీసుకోవాలని.. అధికారులకు సూచించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'దేశద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదు?'
    దేశద్రోహం చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పునఃపరిశీలన పూర్తి చేసే వరకు ఈ చట్టం కింద చర్యలు తీసుకోకుండా రాష్ట్రాలను ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దిల్లీలో మళ్లీ 'ఆపరేషన్ బుల్డోజర్'..
    దిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతూనే ఉంది. షాహీన్​బాగ్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల సోమవారం వెనక్కితగ్గిన అధికారులు.. దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో తిరిగి కూల్చివేతలను ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శ్రీలంకలో హింస.. రాజపక్స ఇంటికి నిప్పు.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం
    ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకలో సోమవారం అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. ప్రజలు, ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి మహీంద రాజపక్స వెనక్కితగ్గి.. తన పదవికి రాజీనామా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తగ్గిన బంగారం ధర.. తెలంగాణ, ఏపీలో ఎంతంటే?
    బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పీవీ సింధు జోరు.. క్వార్టర్స్​లో భారత్​
    ఉబెర్​ కప్​ 2022లో భారత్​ 4-1తేడాతో యూఎస్​ఏను ఓడించి క్వార్టర్​ ఫైనల్స్​లో అడుగుపెట్టింది. పీవీ సింధు 21-10, 21-11 తేడాతో గెలవగా.. మిగతా భారత ప్లేయర్లు కూడా మంచి ప్రదర్శన చేసి టోర్నీలో మరో అడుగు ముందుకేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'గాడ్​ఫాదర్'​ రిలీజ్ డేట్​.. ఫస్ట్​లుక్​తో అల్లరి నరేశ్​​.. 'ది ఘోస్ట్'​ కొత్త షెడ్యూల్
    కొత్త సినిమాలకు సంబంధించిన కొన్ని అప్డేట్స్​ సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో చిరంజీవి 'గాడ్​ఫాదర్'​ రిలీజ్ డేట్​, నాగార్జున 'ది ఘోస్ట్'​ కొత్త షెడ్యూల్​, అల్లరినరేశ్​ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఫస్ట్​లుక్​ పోస్టర్​ వివరాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details