- గవర్నర్తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భేటీ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్‌ను కలిశారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలను వివరించారు. అధికారులపై క్రమశిక్షణ చర్యల్ని గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రాష్ట్రంలో 2 కోట్లకు పైగా గ్రామీణ ఓటర్లు... ఆ జిల్లాలోనే అత్యధికం!
రాష్ట్రంలో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో రెండు కోట్ల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు జాబితా సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషనర్ కు ఉన్నతాధికారులు నివేదించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చోరీ సొత్తులో... రాబట్టింది సగమే!
రాష్ట్రంలో దోపిడీలు, దొంగతనాలు, కొల్లగొట్టడాలు తదితర నేరాల్లో బాధితులు పోగొట్టుకున్న సొత్తులో సగమే స్వాధీనం అవుతోంది. రాష్ట్రంలో 2014 నుంచి 2019 మధ్య మొత్తం రూ.718.19 కోట్ల సొత్తు దొంగలపాలైంది. అందులో రూ.319.63 కోట్లనే పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. అంటే తిరిగి రాబట్టగలిగింది 44.50 శాతమే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఇది సిక్కుల ఉద్యమం కాదు.. రైతు ఉద్యమం: టికైత్
ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మక ఘటనలకు పాల్పడి, పోలీసుల బారికేడ్లు ధ్వంసం చేసిన వారు ఇకపై ఉద్యమంలో భాగం కాలేరని భారత్ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికైత్ తేల్చి చెప్పారు. ఎర్రకోటపై జెండాలు ఎగురవేసిన వారు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- గణతంత్ర పరేడ్'పై 22 ఎఫ్ఐఆర్లు.. భద్రత కట్టుదిట్టం
దిల్లీ సరిహద్దులో మంగళవారం రైతులు నిర్వహించిన గణతంత్ర పరేడ్లో హింసాత్మక ఘటనలపై పోలీసులు 22 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 153 మంది పోలీసులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- దేశంలో మరో 12,689 కరోనా కేసులు