- ప్రైవేట్ స్థలాల్లో ఓకే..చవితికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు (Ganesh idols) అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు (AP High Court) ఆదేశించింది. వినాయక చవితి ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషిన్‌పై (Petition) హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి: జగన్
కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.6 శాతం ఉందని.. 10 వేల 494 సచివాలయాల పరిధిలో యాక్టివ్ కేసుల నమోదు శాతం సున్నాగా ఉందని.. అధికారులు సీఎంకు వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇకపై ప్రభుత్వ వెబ్సైట్లో సినిమా టికెట్స్..
ఇకపై సినిమా టికెట్ కొనాలంటే థియేటర్ వరకు, యాప్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని కోసం ఓ వెబ్సైట్ రన్ చేసేందుకు సిద్ధమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- STEEL PLANT: విశాఖ స్టీల్‌ప్లాంట్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
విశాఖ స్టీల్‌ప్లాంట్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిపింది. సీబీఐ విశ్రాంత అధికారి లక్ష్మీనారాయణ, మరొకరు పిటిషన్లు వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమెరికా, బ్రిటన్, రష్యాతో కలిసి భారత్ 'ఆపరేషన్ అఫ్గాన్'
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల(Afghanistan Taliban) ఆక్రమణతో ఉగ్రవాదం, భద్రత వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. అఫ్గాన్‌కు భౌగోళికంగా దగ్గరగా ఉన్న దేశాల్లో చైనా ఇప్పటికే తాలిబన్లకు మద్దతు పలికింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఎన్‌డీఏలో మహిళల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్'
నేషనల్ డిఫెన్స్ అకాడమీలో(Female Entry In Nda) మహిళలకు అనుమతి కల్పించనున్నట్లు సుప్రీంకోర్టుకు(Nda Supreme Court) కేంద్రం తెలిపింది. మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుపై త్రివిధ దళాల ఉన్నతాధికారులతో చర్చించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తాలిబన్లకు ఆ మార్కెట్ అండ- అందుకే అమెరికా ఆంక్షలు బేఖాతర్!
అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ అఫ్గాన్పైఆంక్షలు విధించినా ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా కాపాడే శక్తి ఓ మార్కెట్‌కు ఉంది. ఈ విషయాన్ని పసిగట్టే రోజుకు రూ.వందల కోట్ల నగదు మార్పిడి, లావాదేవీలు జరిగే ఈ ప్రాంతాన్ని తాలిబన్లు(Afghan Taliban) ఆగస్టు 15నే తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రబీ పంటకు మద్దతు ధర పెంచిన కేంద్రం
రబీ పంట.. 2022-23 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించిన కనీస మద్దతు ధరలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ఇందులో గోధుమ ధర క్వింటాకు రూ.40 ధరను పెంచింది. కొత్త ధరల వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Paralympics: 'అప్పుడు 19 మంది.. ఇప్పుడు 19 పతకాలు'
పారాలింపిక్స్ విజేతలను సన్మానించిన క్రీడామంత్రి అనురాగ్ ఠాకుర్(anurag thakur).. వారి విజయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. దిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Pawan Kalyan: పవన్ కొత్త సినిమా అప్డేట్.. దాని గురించేనా?
'ఏ పవర్ ప్యాక్డ్ అనౌన్స్మెంట్' రానుంది. పవన్ కొత్త సినిమా నుంచి వచ్చే ఆ ఆప్డేట్ ఏంటా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇంతకీ అది ఏమై ఉంటుంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధానవార్తలు @9PM