ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Topnews: ప్రధాన వార్తలు @ 9PM - ap top ten news

..

ప్రధాన వార్తలు @ 9PM
ప్రధాన వార్తలు @ 9PM

By

Published : Aug 16, 2021, 9:01 PM IST

  • LOKESH RELEASED: పెదకాకాని పీఎస్‌ నుంచి నారా లోకేశ్‌ విడుదల
    గుంటూరులో రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిగా అరెస్టైన నారా లోకేశ్​ను..పెదకాకాని పీఎస్‌ నుంచి పోలీసులు విడుదల చేశారు. లోకేశ్‌పై 151 సీఆర్పీసీ కింద అభియోగాలు నమోదు చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • gunturu murder case overall : రణరంగంగా మారిన గుంటూరు... పరామర్శకు వెళ్లిన తెదేపా నేతలు అరెస్టు
    దళిత యువతి రమ్య హత్య ఘటన తర్వాత గుంటూరులో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు.. అరెస్టు చేశారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలుగుదేశం నేత నారా లోకేశ్ గుంటూరు రావడంతో పరిస్థితి వేడి వేడిగా మారింది. గుంటూరులో పోలీసు పహారా పెంచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
    రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ కార్యదర్శి ముకేశ్‌ కుమార్ మీనాను... పరిశ్రమలశాఖలో ఫుడ్ ప్రాసెసింగ్ ముఖ్యకార్యదర్శిగా నియమించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • RAINS: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు వర్షాలు
    రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పెగసస్​పై కేంద్రం అఫిడవిట్- ట్రైబ్యునళ్ల జాప్యంపై సుప్రీం అసహనం
    పెగసస్​ వ్యవహారంపై కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలన్నీ తప్పని తెలిపింది. దీనిపై నిపుణుల కమిటీ వేయనున్నట్లు అత్యున్నత ధర్మాసనానికి చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'వ్యాక్సినేషన్‌లో సరిలేరు మనకెవ్వరు..!'
    ప్రపంచ దేశాలకన్నా మిన్నగా భారత్‌లో కొవిడ్‌ టీకా పంపిణీ(Covid Vaccination in India) ఉందని 'భారత్‌ బయోటెక్‌' సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. నాసల్‌ వ్యాక్సిన్‌తో కూడిన మిశ్రమ డోసుతో మరింత రక్షణ ఉంటుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హెలికాఫ్టర్ నిండా డబ్బుతో అఫ్గాన్​ను వీడిన​ ఘనీ!
    అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరువాత ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ దేశాన్ని​ విడిచి వెళ్లారు. ఈ నేపథ్యంలో నాలుగు కార్లతో పాటు ఓ హెలికాప్టర్​ నిండా డబ్బుతో వెళ్లిపోయినట్టు రష్యా అధికారిక మీడియా తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పెట్రోల్​ ధరలను గత ప్రభుత్వంలా మేం తగ్గించలేం: నిర్మల
    యూపీఏ ప్రభుత్వం జిమిక్కులు చేసిన విధంగా తాము పెట్రోల్​ ధరలను తగ్గించలేమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇంధన ధరల పెరుగుదలపై ప్రజల ఆందోళన సరైందేనని అంగీకరించిన సీతారామన్​.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • INDvsENG: భారత్ 298/8 డిక్లేర్డ్.. ఇంగ్లాండ్ లక్ష్యం 272
    ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది. కోహ్లీసేన 298/8 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 391 పరుగులకు ఆలౌటయ్యాక.. 27 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ చివరికి ఆతిథ్య జట్టు ముందు 272 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చరణ్​కు విలన్​గా మిల్కీ బ్యూటీ!
    శంకర్​-రామ్​చరణ్​ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో నటి తమన్నా ఓ కీలక పాత్ర పోషించనుందని తెలిసింది. ఈ ముద్దుగుమ్మ పాత్రపై నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details