ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Top news: ప్రధాన వార్తలు @ 9PM - ఏపీ ముఖ్యవార్తలు

..

TOP NEWS 9PM
ప్రధాన వార్తలు @ 9PM

By

Published : Jun 10, 2021, 9:00 PM IST

Updated : Jun 10, 2021, 9:40 PM IST

  • కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటీ
    దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ పలువులు కేంద్ర మంత్రులను కలిశారు. పోలవరం నిర్మాణంపై గజేంద్రసింగ్‌తో సీఎం విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మూడో దశ ముప్పుపై స్పష్టత లేదు.. అయినా మేం సిద్ధం'
    రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు సర్కార్ తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు విచారణ చేసింది. బ్లాక్ ఫంగస్ కేసులు, వ్యాక్సినేషన్‌ సహా మూడో దశలో కరోనా విజృంభణ తదితర అంశాలపై ధర్మాసనానికి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆస్తి పన్ను పెంపుపై ఎన్నికల ముందే చట్టం చేశాం: బొత్స
    రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో నూతన ఆస్తి పన్ను విధానంలో మొత్తం అంతా కలిపి 15 శాతం లోపే ఉంటుందని... మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. ఆస్తి పన్ను పెంపుపై ఎన్నికల ముందే చట్టం చేసినట్టు గుర్తుచేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కరోనా కేసుల్లో తగ్గుదల... కొత్తగా 8,110మందికి పాజిటివ్
    రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. 24 గంటల వ్యవధిలో 97,863 మందికి పరీక్షలు చేయగా... 8,110 మందికి వైరస్‌ సోకింది. మహమ్మారికి మరో 67 మంది బలయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆగస్టు 2 నుంచి సివిల్స్​ ఇంటర్వ్యూలు
    ఆగస్టు 2 నుంచి సివిల్​ సర్వీసెస్​ పరీక్ష-2020 ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు యూనియన్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల కాల్​ లెటర్లను అధికారిక వెబ్​సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Remdesivir: 'పిల్లలకు ఆ ఇంజక్షన్​ అసలు ఇవ్వొద్దు'
    చిన్నపిల్లలకు కరోనా చికిత్సపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను పిల్లలకు అసలు ఇవ్వకూడదని నిర్దేశించింది. స్వల్ప లక్షణాలుంటే ఆసుపత్రుల్లో చేర్పించవద్దని సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 2021-22 వృద్ధి రేటు 8.5 శాతం!
    ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 8.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంవంతమైతే వృద్ధి రేటు మరింత పెరిగేందుకు అవకాశాలున్నాయని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Yuvraj: కెప్టెన్సీ నాకే అనుకున్నా.. కానీ ధోనీకిచ్చారు
    2007 టీ20 ప్రపంచకప్​(T20 World cup) సారథ్య బాధ్యతలు తనకు అప్పగిస్తారని భావించినట్లు తెలిపాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్(Yuvraj Singh)​. అలా తాను ఎందుకు ఆశించానో గల కారణాన్ని వివరించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఆదిత్య 369' సీక్వెల్​తో మోక్షజ్ఞ ఎంట్రీ
    'ఆదిత్య 369' సీక్వెల్​పై స్పందించారు నటుడు బాలకృష్ణ. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కిస్తానని స్పష్టం చేశారు. ఇందులో మోక్షజ్ఞ కూడా నటిస్తాడని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
Last Updated : Jun 10, 2021, 9:40 PM IST

ABOUT THE AUTHOR

...view details