- 'నాకు ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించండి'
తనకు ప్రాణహాని ఉందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణరాజు లేఖలు రాశారు. కేంద్ర భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించాలని లేఖలో కోరారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపినందుకు తనపై దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- 'రాజధాని మార్పు గురించి ఇప్పుడు ఆలోచించే పరిస్థితి లేదు'
కరోనాతో రాజధాని మార్పు గురించి ప్రస్తుతం ఆలోచించే పరిస్థితి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కరోనా తగ్గుముఖం పట్టాక..సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజధాని తరలింపు అంశం గవర్నర్ కూడా చెప్పారన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- 'చేనేతలకు జగన్ ద్రోహం చేస్తున్నారు'
చేనేతలకు ముఖ్యమంత్రి జగన్ ద్రోహం చేస్తున్నారని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప విమర్శించారు. రాష్ట్రంలో 81 వేల మందికే పథకం ద్వారా లబ్ధిచేకూర్చుతున్నారన్నారు. మెుత్తం 3.5 లక్షల మంది చేనేత వృత్తిదారులకూ పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- నకిలీ ఎస్సై... యువతిని మోసం చేశాడు..!
తాను ఎస్సై ఉద్యోగం చేస్తున్నానంటూ... యువతికి కుచ్చుటోపి పెట్టాడు ఓ మోసగాడు. డిపార్ట్మెంట్లో దొర్లిన చిన్న తప్పిదం కారణంగా ఇటీవల సస్పెండ్‌కు గురయ్యానంటూ నమ్మబలికాడు. ఇంటి వద్దే ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నానని అబద్ధాలు చెప్పాడు. యువతిని పెళ్లి చేసుకొని ఆమె కుటుంబం నుంచి 20 లక్షల కట్నం తీసుకున్నాడు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- హైదరాబాద్ నుంచి కరోనా మందు
కొవిడ్-19 చికిత్సకు సంబంధించి దేశంలోనే మొదటి జెనరిక్ ఔషధం రెమ్‌డెసివిర్ (కొవిఫోర్) తయారీకి తమ సంస్థకు ఆమోదం లభించినట్లు ప్రముఖ మందుల తయారీ సంస్థ హెటెరో ప్రకటించింది. మరో వారం రోజుల్లో డ్రగ్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- 20 హత్యల సైనైడ్ మోహన్‌కు శిక్ష!