- Grmb subcommittee meet : నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం భేటీ
గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఇవాళ సమావేశం కానుంది. జీఆర్ఎంబీ సభ్యకార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో వర్చువల్ విధానంలో జరగనున్న ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్లు పాల్గొంటారు. బోర్డు ఆధీనంలోకి ప్రాజెక్టులను తీసుకునే విషయమై సమావేశంలో చర్చిస్తారు.
- RTC IN STRIKE: "రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తాం"
పీఆర్సీపై ఉద్యోగులు చేసే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఎన్ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సుజాత తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ఉద్యోగుల సమస్యలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
- విదేశీ సాయానికి కేంద్రం మెలిక.. ప్రాజెక్టులపై నీలినీడలు
విదేశీ సాయానికి కేంద్రం మెలిక పెడుతోంది. రాష్ట్రానికి మెుత్తం రుణం ఇవ్వడం కుదరదని స్పష్టం చేస్తోంది. అన్నీ ప్రాజెక్టుల్లో రాష్ట్ర వాటా ముందుగా ఇవ్వాలని.. లేకుంటే గ్రామీణ రహదారులకూ అడ్వాన్సులు ఇవ్వలేమంటూ రాష్ట్రానికి లేఖ రాసింది. దీంతో రూ.11,290 కోట్ల ప్రాజెక్టులపై నీలినీడలు కమ్ముకున్నాయి.
- Mulugu Siddanthi: ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి హఠాన్మరణం
Mulugu Siddanthi: ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. జ్యోతిషులుగా 30 ఏళ్లకు పైగా ములుగు సిద్ధాంతి సేవలందించారు. సోమవారం సాయంత్రం 5:30 గంటలకు మలక్‌పేట్ రేసు కోర్సు సమీపంలోని హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
- మాల్వా చిక్కితే పంజాబ్ దక్కినట్లే.. అన్ని పార్టీల గురి అక్కడే..!
Malwa In Punjab Election 2022: మాల్వా ప్రాంతంలో అత్యధిక సీట్లు దక్కించుకున్న పార్టీయే పంజాబ్‌లో అధికార పీఠం చేజిక్కించుకోవడం సంప్రదాయంగా వస్తోంది! అందుకే ఇక్కడ చక్రం తిప్పేందుకు అన్ని ప్రధాన పార్టీలూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇంతకీ ఆ ప్రాంతానికి ఎందుకంత ప్రాధాన్యం?
- ఎన్నికల ఖర్చులో తగ్గేదేలే.. 5 రాష్ట్రాల్లో రూ.3500 కోట్ల వ్యయం!
Election Expenses: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ అసెంబ్లీలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో నగదు.. ఏరులై పారే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలు, కూటముల అభ్యర్థులే ఏకంగా రూ.3,500 కోట్ల వరకు ఖర్చు పెట్టే అవకాశమున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాష్ట్రాలవారీగా సంబంధిత అంచనాలను పరిశీలిస్తే..
- చౌకగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్.. ఐఐటీల కొత్త సాంకేతికత
IIT electric vehicle charging: ఎలక్ట్రిక్ వాహనా(ఈవీ)ల ఛార్జింగ్ కోసం దేశంలోని వివిధ ఐఐటీలకు చెందిన పరిశోధకులు కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉన్న ఛార్జర్ వ్యయాన్ని ఇది సగానికి పైగా తగ్గించనుంది.
- పాక్ ముక్కుపిండి పరిహారం వసూలు చేసిన చైనా!
Dasu Attack on Chinese: పాకిస్థాన్‌లో దాసు హైడ్రోపవర్ డ్యామ్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడికి సంబంధించిన నష్ట పరిహారాన్ని చైనా ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 36 మంది చైనా కార్మికుల కుటుంబాలకు రూ. 282 కోట్ల పరిహారం చెల్లించాలని చైనా డిమాండ్ చేసింది.
- IND VS SA: 'అలాంటి ఆల్‌రౌండర్లు జట్టుకు అవసరం'
IND VS SA: దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. చాహర్‌కు ఇచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నాడని తెలిపాడు. శార్దుల్, చాహర్ లాంటి ఆల్‌రౌండర్లు జట్టుకు అవసరమని అభిప్రాయపడ్డాడు.
- ఇలాంటి టైమ్‌లో నా పెళ్లి కరెక్ట్ కాదు: తమన్నా
Tamanna marriage: తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై హీరోయిన్ తమన్నా స్పందించింది. ఇప్పట్లో వివాహం చేసుకోనని తెలిపింది.