- దిల్లీలో శుక్రవారం బిపిన్ రావత్ అంత్యక్రియలు
Cremation of CDS Bipin Rawat: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఆయన సతీమణి ముధులికా రావత్ అంత్యక్రియలు శుక్రవారం దిల్లీలోని కంటోన్మెంట్ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం వారి భౌతికకాయాలను సైనిక విమానంలో దిల్లీకి తరలించనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రావత్ మృతితో సైనిక సంస్కరణలకు శరాఘాతం!
General Bipin Rawat death: తమిళనాడు కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణించారు. దీంతో దేశంలో సైనిక సంస్కరణల ప్రక్రియకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Saiteja no more: బిపిన్ రావత్‌ను మెప్పించిన తెలుగు'తేజం'
CDS Bipin Rawat personal security guard Saiteja died: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లా వాసి మృతి చెందాడు. అనతి కాలంలోనే సీడీఎస్ బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రత సిబ్బందిలో ఒకరిగా ఎదిగిన సాయితేజ మరణం అందరినీ కలచివేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- AMARAVATI MAHA PADAYATRA: ఉత్సాహంగా మహాపాదయాత్ర.. కులమతాలకతీతంగా అపూర్వ మద్దతు
AMARAVATI MAHA PADAYATRA: రాయలసీమ ప్రజలు సైతం చేతులెత్తి...జై అమరావతి అంటూ రాజధాని రైతులకు సాదర స్వాగతం పలుకుతున్నారు. చిత్తూరు జిల్లాలో అడుగడుగునా హారతులతో గ్రామాలకు ఆహ్వానిస్తున్నారు. ఆంక్షల్ని, అడ్డంకుల్ని లెక్కచేయక కదం తొక్కిన అన్నదాతలు... అన్నివర్గాల సంపూర్ణ మద్దతుతో 38వ రోజున శ్రీకాళహస్తీశ్వరుని చెంతకు చేరుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Sunkesula Dam Gates Problem: సుంకేసుల భద్రతపై నీలినీడలు..సగం గేట్లూ పని చేయని దుస్థితిSunkesula Dam in Kurnool district : కర్నూలు, కడప
జిల్లాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు, ఎన్నో గ్రామాలకు తాగునీరు అందిస్తున్న సుంకేసుల జలాశయానికి ప్రమాదం పొంచి ఉంది. భారీ స్థాయిలో వరద వస్తే గేట్లు ఎత్తలేని పరిస్థితి నెలకొంది. సగానికిపైగా గేట్లు పనిచేయటం లేదని అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రావెలలో దారుణం..రెండు రోజుల పసిపాపను చంపిన తల్లి
గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెలలో దారుణం జరిగింది. కన్నతల్లే రెండు రోజుల పసిపాపను చంపేసింది. ఆడపిల్ల పుట్టిందని తల్లి బొంత లక్ష్మి ఈ ఘాతుకానికి పాల్పడింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- చైనాతో టిమ్ కుక్ భారీ డీల్.. కారణం అదేనా?
China Apple deal: యాపిల్ సీఈఓ టిమ్ కుక్.. చైనాతో 275 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఒప్పందంలో భాగంగా చైనాలో యాపిల్ భారీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- విద్యుత్తు వాహనాల కోసం జియో-బీపీ, మహీంద్రా జట్టు
Jio-bp Mahindra Group: విద్యుత్ వాహనాలు (ఈవీ), తక్కువ కర్బన పరిష్కారాల నిమిత్తం మహీంద్రా గ్రూప్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన బీపీల సంయుక్త సంస్థ రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ (ఆర్‌బీఎంఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- kohli odi captaincy: విరాట్ ఇప్పుడు ఏం చేస్తాడు?
virat kohli removed from odi captain: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీపై ఇలా వేటు పడుతుందని ఏ అభిమాని.. ఊహించి ఉండడు. అసమాన బ్యాటింగ్ ప్రతిభతో భారత క్రికెట్లో ఆధిపత్యం చెలాయించిన అతడిని వన్డే కెప్టెన్‌గా తొలిగించడం వారికి కాస్త మింగుడు పడని అంశమే. అయితే దీనిని కోహ్లీ ఎలా స్వీకరిస్తాడనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'బాలకృష్ణను ఆ పాత్రలో చూడాలనేది చాలా మంది కోరిక'
Balakrishna C Kalyan Movie: బాలకృష్ణతో తన కలల ప్రాజెక్ట్‌ను నిర్మించాలని ఉందని చెప్పారు నిర్మాత సి.కల్యాణ్. రామానుజ చార్యులు పాత్రలో బాలయ్యను చూడాలనేది చాలా మంది కోరిక అని పేర్కొన్నారు.' పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.