ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - ఏపీ ముఖ్యవార్తలు .

ప్రధాన వార్తలు @ 9 PM

TOP NEWS @ 9 PM
ప్రధాన వార్తలు @ 9 PM

By

Published : Apr 8, 2021, 8:58 PM IST

  • జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.. ఫలితం మిగిలింది

రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 47.42 శాతం పోలింగ్‌ నమోదైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • తిరుపతి ఉపపోరు: ఓటర్ల కుటుంబాలకు సీఎం జగన్ లేఖలు

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని కుటుంబాలకు సీఎం జగన్మోహన్​రెడ్డి లేఖలు రాశారు. 22 నెలల పరిపాలనా కాలంలో వైకాపా ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రస్తావించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'ప్రాణం పోయినా సరే చిత్తూరులో ప్రజాస్వామ్యాన్ని కాపాడతా'

తిరుపతిలో తెదేపా అధినేత చంద్రబాబు... లోక్​సభ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన ప్రాణం పోయినా సరే చిత్తూరు జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని శపథం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • హైకోర్టు బార్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తం.. ఒకరికి గాయాలు

బార్ అసోసియేషన్ సభ్యుల సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. న్యాయవాదుల మధ్య చర్చలు వాడీవేడీగా మారి తోపులాటకు దారితీయడంతో బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్ ‌కుమార్​ గాయాలపాలయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కొవిడ్ కట్టడికి సీఎంల సలహాలు కోరిన మోదీ

దేశంలో మరోసారి సవాళ్లతో కూడుకున్న పరిస్థితి తలెత్తుతోందని ప్రధాని పేర్కొన్నారు. కొవిడ్​ను కట్టడి చేసేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రులను కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కోబ్రా జవాను రాకేశ్వర్‌ సింగ్ విడుదల

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్‌ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌కు విముక్తి లభించింది. ఐదు రోజుల తర్వాత నక్సల్స్‌ ఆ జవానును విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • బంగ్లాదేశ్​ పర్యటనలో భారత ఆర్మీ చీఫ్​

భారత ఆర్మీ చీఫ్​ ఎంఎం​ నరవాణే.. ఐదు రోజుల బంగ్లాదేశ్​ పర్యటనలో గురువారం అక్కడికి చేరుకున్నారు. అనంతరం.. ఆ దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • సీరం ఇన్​స్టిట్యూట్​కు ఆస్ట్రాజెనెకా నోటీసులు

టీకా డోసుల సరఫరాలో ఆలస్యంపై సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఆస్ట్రాజెనెకా.. లీగల్ నోటీసులు పంపించింది. ఈ విషయంపై పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు సీరం సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఆస్పత్రి నుంచి సచిన్ తెందూల్కర్ డిశ్చార్జ్

కరోనా ప్రభావంతో కొన్నిరోజల క్రితం ఆస్పత్రిలో చేరిన సచిన్.. ఇంటికొచ్చేశాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'లవ్​స్టోరీ' వాయిదా- 'రౌడీ బాయ్స్'లో అనుపమ

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్​స్టోరీ' సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ప్రముఖ నిర్మాత దిల్​రాజు​ వారసుడిగా ఎంట్రీ ఇస్తున్న ఆశీష్​ నటిస్తున్న 'రౌడీబాయ్స్'​ మోషన్​ పోస్టర్​ విడుదలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details