- 'ప్రకృతి సాగుకు పాధ్యాన్యమివ్వాలి.. ఆ రైతులకు రివార్డులివ్వాలి'
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై సోమవారం నీతి ఆయోగ్ నిర్వహించిన జాతీయ సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విధానంపై వివరాలు అందించడంతోపాటు కేంద్రానికి పలు సూచనలు చేశారు. అధిక విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేసే రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫార్సుల్లో వెయిటేజీ ఇవ్వాలని కోరారు.
- Perni Nani: ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు, తెలివితేటలు వాడుకుంటాం: పేర్ని నాని
Perni Nani: వచ్చే ఎన్నికల్లో వైకాపా ఒంటరిగానే పోటీ చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు, తెలివితేటలు మాత్రమే వాడుకుంటామని స్పష్టం చేశారు.
- రాష్ట్రాల అప్పులపై కేంద్రం జోక్యం అవసరం.. ఆర్థిక ఎమర్జెన్సీకీ వెనకాడొద్దు!
Duvvuri Subbarao Interview : "ఆర్బీఐ నివేదిక చూశా. గ్యారంటీల పెరుగుదల ఎక్కువగా ఉన్న మొదటి అయిదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. జీఎస్డీపీతో పోల్చి చూసినపుడు ఏపీలో ఈ పెరుగుదల గత ఏడాది కంటే ఎక్కువ. ప్రభుత్వం చేసే అప్పులే కాదు. గ్యారంటీ ఇచ్చి తీసుకొనే రుణాలు తీర్చే బాధ్యతా సర్కారు మీదే ఉంటుంది. రాష్ట్రాల అప్పుల భారం ఎంత ఉందో అధ్యయనం చేయాలంటే బడ్జెట్లో పేర్కొనని అదనంగా చేసిన అప్పులు, పద్దులో కనపడకుండా కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చే అప్పులు, కంటింజెంట్ లయబిలిటీస్ కలిపి తీసుకొంటే చాలా రాష్ట్రాలు అనుకొన్నదానికంటే అధ్వానంగా ఉన్నాయి. సంక్షోభం పొంచి ఉంది." - దువ్వూరి సుబ్బారావు , రిజర్వ్‌బ్యాంకు మాజీ గవర్నర్
- APUTF: యూటీఎఫ్ 'చలో సీఎంవో'పై .. పోలీసుల ఉక్కుపాదం
APUTF Demand to Cancel CPS: సీపీఎస్ రద్దు చేయాలన్న డిమాండ్‌తో యూటీఎఫ్ తలపెట్టిన సీఎంవో ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఎక్కడికక్కడ అడ్డగింతలు, అరెస్టులు, నిర్బంధాలతో అణగదొక్కారు. రెండు రోజుల ముందు నుంచే నిర్బంధకాండ ప్రారంభించిన పోలీసులు.. సీఎంవో ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అన్ని నిర్బంధాలనూ చేధించుకుని విజయవాడ చేరుకున్న కొందరిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
- 'ఆ చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నాం'
అధికార భాషా చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుతం... హైకోర్టులో అఫిడవిట్ వేసింది. సరైన స్ఫూర్తితో అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పేర్కొంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
- కాంగ్రెస్ ప్రక్షాళనకు మేధోమథనం.. ఉదయ్పుర్లో చింతన్ శివిర్
Congress news: వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా ‘నవసంకల్ప్ చింతన్ శివిర్’ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పార్టీలో ప్రక్షాళన, పునరుత్థానంపై విసృత స్థాయి చర్చలు జరపనుంది.
- భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం: షెహబాజ్ షరీఫ్
Pakistan On Modi Jammu Visit: పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు షెహబాజ్ షరీఫ్ చెప్పారు. అలాగే భారత ప్రధానమంత్రి కశ్మీర్ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది పాకిస్థాన్.
- ఆవిరవుతున్న పెట్టుబడులు- వాటాదారుల 'ఫ్యూచర్' ఏంటి?
Future Group: కొవిడ్ పరిణామాలు, రిలయన్స్ సంస్థతో కుదిరిన ఒప్పందం రద్దైన నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూపు సంస్థ వాటాదార్ల పెట్టుబడులు ఆవిరైపోతున్నాయి. గ్రూప్ యజమాని బియానీ కుటుంబానికి సంబంధించిన వాటాలు తగ్గిపోయాయని.. వీరు తనఖా పెట్టిన షేర్లను రుణదాతలు సీజ్ చేయడమే కారణమని కార్పొరేట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
- IPL 2022: రేసులోనే చెన్నై.. ఫ్లేఆఫ్స్ చేరే జట్లు ఏవి?
IPL 2022: ఐపీఎల్ 2022లో గొప్ప పేరున్న జట్లు తేలిపోగా ఏమాత్రం అంచనాల్లేని జట్లు చెలరేగిపోతున్నాయి. టోర్నీ ప్రారంభమై నెల కావొస్తుంది. ఈ మెగా సందడి మరో 30 రోజులకు పైగా సాగనుంది. ఇప్పటికే 37 మ్యాచ్‌లు పూర్తవ్వగా ఇంకా 33 మ్యాచ్‌లు మిగిలున్నాయి. అయితే అప్పుడే ప్లేఆఫ్స్ చేరే జట్లేవో ఓ అంచనా వచ్చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరెవరు ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉందో చూద్దాం..