- CM Jagan Delhi Tour: నేడు దిల్లీకి సీఎం జగన్.. ప్రధానితో భేటీ
CM Jagan Delhi Tour:ముఖ్యమంత్రి జగన్.. రెండురోజుల పర్యటనలో భాగంగా నేడు దిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. వారి అపాయింట్మెంట్లు దాదాపు ఖరారు అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయవర్గాల సమాచారం. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు అవసరం గురించి, 26 జిల్లాల ఏర్పాటు విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని తెలిసింది.
- ఏపీ కేబినెట్ సమావేశం.. ఈనెల 7వ తేదీ మధ్యాహ్నానికి వాయిదా
ఈ నెల 7వ తేదీన జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. వాయిదా పడింది. అయితే.. అదే రోజు మధ్యాహ్నాం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుందని సీఎస్ కార్యాలయం వెల్లడించింది.
- CRDA New Commissioner: సీఆర్డీఏ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వివేక్ యాదవ్
CRDA new commissioner: ఏపీసీఆర్డీఏ కొత్త కమిషనర్‌గా వివేక్ యాదవ్ నియమితులయ్యారు. ఆయన గుంటూరులో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కమిషనర్‌గా పని చేసిన విజయ్‌కృష్ణన్.. బాపట్ల జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు.
- Police Sub-divisions: ఒకే పోలీసు సబ్ డివిజన్... 3 జిల్లాల పరిధిలోకి..!
Police subdivisions: జిల్లాలను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ సబ్డివిజన్లలో మార్పులు, చేర్పులు చేపట్టలేదు. వాటిపై ఇంకా స్పష్టతనివ్వలేదు. నగర కమిషనరేట్లను ఆనుకుని ఉన్న ప్రాంతాలు గ్రామీణ పరిధిలోకి తీసుకొచ్చింది. ఏయే పోలీసుస్టేషన్లు ఏయే సబ్డివిజన్ల పరిధిలోకి వస్తాయనే దానిపైన నోటిఫికేషన్లు విడుదల కాలేదు. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు కొన్ని స్టేషన్లను సమీపంలోని సబ్ డివిజన్లకు అటాచ్ చేశారు.
- తెలంగాణ జల విద్యుదుత్పత్తిని నిలువరించండి.. కేఆర్ఎంబీకీ ఏపీ లేఖ
AP Letter to KRMB: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ చేస్తున్న నీటి వినియోగాన్ని అడ్డుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి లేఖ రాశారు. వేసవిలో తాగు నీటి అవసరాలు తీర్చాల్సి ఉన్నందున సాగర్ నీటితో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయకుండా నిలువరించాలని కోరారు.
- 'ఇదేం పిచ్చితనం.. బెయిల్‌కు పోస్టుమార్టంతో సంబంధమేంటి?'
Supreme Court on Lakhimpur Case: లఖింపుర్‌ఖేరీ కేసులో నిందితుడైన ఆశిష్ మిశ్ర బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బెయిల్ మంజూరుకు పోస్టుమార్టం నివేదిక, గాయాలు తదితర అంశాలను అలహాబాద్ హైకోర్టు ప్రాతిపదికగా తీసుకోవడాన్ని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ తప్పుపట్టారు.
- సంక్షోభం గుప్పిట్లోనే పాక్.. ఆపద్ధర్మ ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్!
Pakistan political crisis: పాకిస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విపక్షాలు.. సొంతంగా ఆమోదించుకున్నాయి. మరోవైపు, ఆపద్ధర్మ ప్రధాని నియామకానికి పేర్లు సూచించాలని ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ.. ఇమ్రాన్ సహా ప్రతిపక్ష నాయకుడికి లేఖ రాశారు.
- మళ్లీ బాదుడు.. ఆ నగరంలో రూ.120 దాటిన పెట్రోల్ ధర
Petrol diesel price today: దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో పెట్రోల్, డీజిల్‌పై 80 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయంటే ?
- 'మరీ అంత ఘోరమా.. స్లెడ్జింగ్, అంపైరింగ్‌పై ఐసీసీకి ఫిర్యాదు!'
Bangladesh Complaint ICC: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైంది బంగ్లాదేశ్. రెండో ఇన్నింగ్స్‌లో దారుణంగా 53 పరుగులకే ఆలౌటైంది. అయితే.. ఈ మ్యాచ్‌లో అంపైరింగ్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై ఐసీసీని ఆశ్రయించనున్నట్లు బంగ్లాదేశ్ బోర్డు పేర్కొంది. వన్డే సిరీస్‌కు సంబంధించి ఇప్పటికే రాతపూర్వక ఫిర్యాదు నమోదుచేసినట్లు తెలిపింది.
- పోరాట ఘట్టాల కోసం కదనరంగంలోకి బాలయ్య
NBK 107 Movie: మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రంలో పోరాట ఘట్టాల చిత్రీకరణ కోసం మరోసారి కదనరంగంలోకి దిగుతున్నారు కథానాయకుడు బాలకృష్ణ. ఆయన 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మంగళవారం నుంచే కొత్త షెడ్యూల్ మొదలు కానుంది.